Samantha Babymoon: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియెత్నాంలో బేబీమూన్ ఎంజాయ్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ క్యూట్ క్షణాలకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూసేయండి.
సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్ల సినిమా 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు దాటడమే కాదు, త్వరలో తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.
26
వియెత్నాంలో ఎంజాయ్ చేస్తోన్నజంట..
ఈ జంట వియెత్నాంలో కలల లోకంలాంటి వెకేషన్‌ను ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత "జస్ట్ అస్" అని రాసింది. ఈ ఫోటోల్లో ఇద్దరూ మంచి ఫుడ్ తింటూ, ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. సమంత తన బేబీ బంప్‌తో మెరిసిపోతోంది.
36
లుక్ అదిరిపోయింది
ఫ్లేర్డ్ డిజైన్ ఉన్న ఈ నల్ల డ్రెస్‌లో సమంత ఎంత అందంగా కనిపిస్తోంది. బేబీ బంప్‌తో ఆమె లుక్ అదిరిపోయింది. సమంత ను ఇలా చూసి అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. ఆమె జీవితంలో స్ట్రగుల్ టైమ్ పోయిందని పండగచేసుకుంటున్నారు. రకరకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.
భర్తతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత. ఇద్దరు స్నేహితుల్ల మసులుకుంటూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలో రాజ్ తన ఫుడ్‌తో ఒక మూమెంట్‌లో ఉండగా, సమంత ఆ క్షణాన్ని పర్ఫెక్ట్‌గా కెమెరాలో బంధించింది. ఈ ఫోటో చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు.
56
స్పందిస్తున్న సెలబ్రిటీలు..
అన్ని ఫోటోల్లోనూ సమంత గ్లోయింగ్‌గా కనిపిస్తోంది. సన్-కిస్డ్ ఫోటోలు, రుచికరమైన ఫుడ్.. ఇలా ఆమె బేబీమూన్ ఒక అద్భుత కథలా సాగింది. ఈ జంట ఫోటోలకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా హార్ట్-ఐ ఎమోజీతో స్పందించింది.
66
అభిమానులు ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే?
సమంత ఈ ఫోటోలు షేర్ చేయగానే అభిమానులు వెంటనే స్పందించారు. "ఈ మధ్య లైఫ్ మీకు బాగా కలిసొచ్చినట్టుంది" అని ఒకరు, "ది బేబీ బంప్" అని మరొకరు కామెంట్ చేశారు. "అమ్మా, హాలిడే ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావ్?" అని ఇంకొకరు రాశారు.