రెండో భాగంలో శ్రీవల్లి Rashmika పాత్ర మధ్యలోనే చనిపోతుందని, కానీ ఆమె పుష్పరాజ్ మెమొరీలో మాత్రం చాలా సేపు రన్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఆమె చనిపోయాక ఆ లోటుని భర్తీ చేసేలా సమంత రోల్ ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇందులో బన్నీ(Allu Arjun), ఫహద్ ఫాజిల్, అనసూయ,సునీలతోపాటు కొత్తగా విజయ్ సేతుపతి, ప్రియమణి కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది.