ఇప్పటికీ సమంత టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి. సమంత ప్రస్తుతం యశోద, ఖుషి, శాకుంతలం లాంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే సమంత గురించి వినిపిస్తున్న ఓ గాసిప్ నెట్టింట దుమారం రేపుతోంది. సమంత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు.