
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. సినీ ప్రముఖుల జీవితాలు, మ్యారేజ్ లైఫ్, సినీ కెరీర్‌కి సంబంధించి జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత మ్యారేజ్ విషయంలో ఆయన ముందు చెప్పినట్టుగానే జరగడంతో ఇప్పుడు ఆయన చెప్పే విషయాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, నయనతార, అనుష్క జీవితాలకు సంబంధించి ఆయన చెప్పిన జ్యోస్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. చర్చనీయాంశంగా మారింది.
అందులో భాగంగా స్టార్ హీరోయిన్లు సమంత(Samantha), నయనతార(Nayanathara), పూజా హెగ్డే(Pooja Hegde), రష్మిక మందన్నా(Rashmika Mandanna)లకు సంబంధించిన సినీ కెరీర్‌కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్లలో వీరి సినీ జీవితానికి ముగింపు కార్డ్ పడుతుందంటూ పెద్ద దుమారం రేపారు. ప్రస్తుతం ఆయన చెప్పిన విషయాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇంకా చెప్పాలంటే నాగచైతన్యతో విడిపోయిన తర్వాతనే ఆమె మరింత రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. బోల్డ్ రోల్స్ చేయడంలోనూ ముందే ఉంటుంది. ఇక సమంత కెరీర్ కి తిరుగులేదని అంతా భావిస్తున్నారు. ఆమె సినిమాల లైనప్ చూస్తుంటే మరో పదేళ్ల వరకు ఆమెకి ఢోకా లేదంటున్నారు. కానీ జ్యోతిష్యుడు వేణు స్వామి మాత్రం మరో రెండేళ్ల(2024)లో సమంత సినీ కెరీర్ అయిపోతుందని, సినిమా ఛాన్స్ లు తగ్గిపోతాయని చెప్పడం గమనార్హం.
వేణు స్వామి చెప్పిన వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఉంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన్నా. నేషనల్ క్రష్‌గా ఊహించని క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా రాణిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే దూసుకుపోతున్న రష్మిక మందన్నా కెరీర్ మరో రెండేళ్లలో క్లోజ్ అవుతుందని చెప్పడం దుమారం రేపుతుంది. స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న రష్మిక సినిమా కెరీర్ ఇంకా రెండేళ్లే అనే వ్యాఖ్యలు నమ్మ శక్యం లేవంటున్నారు నెటిజన్లు.
`లక్కీ హీరోయిన్`, `గోల్డెన్ లెగ్` అనే ట్యాగ్‌లతో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న పూజా హెగ్డేపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వేణు శ్రీరామ్. పూజా సినిమా జీవితం ఇంకా రెండేళ్లే అని తెలిపారు. ఆ తర్వాత ఆమె క్రేజ్ పూర్తిగా పడిపోతుందని, సినిమా లైఫ్‌కి ఇంకా రెండేళ్లే అన్నారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ మూడు ఫ్లాప్‌లతో ఉన్న పూజాకి ఈ వార్త పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. ఆమె అభిమానుల్ని ఇది కలవరపెడుతుంది.
మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా, లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తుంది నయనతార. వచ్చే నెలలో ప్రియుడు విఘ్నేష్ శివన్‌ని మ్యారేజ్ చేసుకోబోతుంది. ఆమె మ్యారేజ్ లైఫ్ కూడా సమంత లాగే ఉంటుందన్న జ్యోతిష్యుడు ఆమె సినిమా కెరీర్ కి కూడా ఇంకా రెండేళ్లే అని చెప్పి పెద్ద బాంబ్ పేల్చాడు. ఇప్పుడున్న ఈ పీక్‌నెస్ రెండేళ్లలో పూర్తిగా డౌన్ అయిపోతుందని అంటున్నారు. 2024 వరకు మాత్రమే బాగా రాణిస్తారని, ఆ తర్వాత కెరీర్ పతనమవుతుందని తెలిపారు వేణు స్వామి. జ్యోతిష్యానికి, నిజజీవితానికి సంబంధం లేదు. మరి ఆయన చెప్పిన దాంట్లో ఎంత నిజమనేది తేలాలంటే మరో రెండేళ్లు ఆగాల్స
ప్రస్తుతం సమంత `శాకుంతలం` వంటి మైథలాజికల్ మూవీ, `యశోద` వంటి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తుంది. అలాగే ఓ అంతర్జాతీయ సినిమా చేస్తుంది. హిందీలో తాప్సీ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయబోతుందని టాక్.
ఇక రష్మిక మందన్నా కెరీర్ ప్రస్తుతం పరుగులు పెడుతుంది. ఆమె `పుష్ప`తో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు `పుష్ప 2`, `విజయ్66`, `సీతారామ్`, `మిషన్ మజ్ను`, `గుడ్‌బై`, `యానిమల్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా నిలుస్తుంది.
మరోవైపు పూజా మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ గా, ఆమె పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండేది. కానీ `రాధేశ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` పరాజయాలతో ఖంగుతిన్నది. ఆమె కెరీర్ ఇప్పుడు దైలమాలో పడింది. ప్రస్తుతం ఆమె మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తుంది. పవన్-హరీష్ శంకర్ సినిమా చేయనుంది. హిందీలో సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేస్తుంది.
నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. కానీ ఆమె నటించిన చిత్రాలు ఆశించిన రిజల్ట్ ని ఇవ్వడం లేదు. ఇటీవల ప్రియుడు విఘ్నేష్ రూపొందించిన `కాతు వాకుల రెండు కాదల్` చిత్రంతో పరాజయం చవిచూసింది. తెలుగులో `గాడ్ ఫాదర్`లో సిస్టర్ రోల్ చేస్తుంది. అలాగే హిందీలో అట్లీ-షారూఖ్ ఖాన్ చిత్రంలో నటిస్తుంది. ఇవే కాకుండా `ఓ2`, `గోల్డ్`, `కనెక్ట్` చిత్రాలు చేస్తుంది నయన్.