SVP Movie: మహేష్ చెప్పిన ఆ డైలాగ్ బన్నీపై సెటైర్... సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

Published : May 12, 2022, 01:54 PM IST

మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. నేడు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైంది. కాగా ఈ మూవీలో మహేష్ చెప్పిన ఓ డైలాగ్ హీరో బన్నీపై సెటైర్ అంటున్నారు.

PREV
16
SVP Movie: మహేష్ చెప్పిన ఆ డైలాగ్ బన్నీపై సెటైర్... సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
Sarkaru Vaari Paata

కొన్నాళ్లుగా మహేష్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో 2020 సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఇద్దరు హీరోల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. పెద్దల పంచాయితీ వరకు వ్యవహారం వెళ్ళింది. చివరికి దిల్ రాజు ఈ గొడవను సెటిల్ చేశారు.

26

సరిలేరు నీకెవ్వరు-అల వైకుంఠపురంలో చిత్రాలలో మాది పెద్ద విజయం అంటే మాది అంటూ పోస్టర్స్, కలెక్షన్స్ వార్ నడించింది. అప్పటి నుండి మహేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇగో వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట మూవీలో మహేష్ (Mahesh Babu)చెప్పిన ఓ డైలాగ్ అల్లు అర్జున్ పై సెటైర్ అంటున్నారు. 
 

36


ఓ సన్నివేశంలో నటుడు సుబ్బరాజ్ యాంకిల్ లెంగ్త్ ప్యాంటు ధరించి మహేష్ వద్దకు వస్తాడు. అప్పుడు మహేష్.. అదేంటీ సగం ప్యాంటు వేసుకున్నావ్ అంటాడు. ఇప్పుడు అదే స్టైల్ ని చెప్పగానే, మహేష్ వెటకారంగా నవ్వుతాడు. మహేష్ ఈ డైలాగ్ బన్నీని ఉద్దేశించి చేశారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. 
 

46


ఆలా వైకుంఠపురంలో మూవీలో అల్లు అర్జున్ (Allu Arjun)యాంకిల్ లెంగ్త్ ప్యాంట్స్ ధరిస్తారు. అయితే ఇదంతా నెటిజెన్స్ ఊహ మాత్రమే. మహేష్ ఈ విధంగా కూడా బన్నీ పేరుప్రస్తావించకున్నా జనాలు తమకు తాము ఈ భావనకు వచ్చి కొత్త చర్చకు తెరలేపుతున్నారు. 

56

మరోవైపు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)ఓపెనింగ్స్ పరంగా రికార్డు వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్ సిటీలో నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డు సొంతం చేసుకున్న సర్కారు వారి పాట నైజాంతో పాటు యూఎస్ లో భారీ వసూళ్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

66

సర్కారు వారి పాట సమాజంలో జరుగుతున్న ఆర్థిక నేరాలను ఉద్దేశిస్తూ ఓ సెటైరికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మహేష్ వన్ మాన్ షో అలరించగా కీర్తి సురేష్ గ్లామర్, రొమాన్స్ సినిమాలో హైలెట్స్ అంటున్నారు. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories