నార్త్ ని ఏలేస్తున్న టాలీవుడ్... బాలీవుడ్ అనుమానాలు పూర్తిగా తీర్చేసిన ఆర్ ఆర్ ఆర్, పుష్ప! 

Published : May 12, 2022, 04:43 PM IST

ఒకప్పుడు తెలుగు సినిమాకు, పరిశ్రమకు రాష్ట్రం దాటితే గుర్తింపు ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు దేశంలోనే భారీ చిత్రాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్ (Tollywood) ఎదిగింది. సౌత్ అంటే తమిళ సినిమాలే అనుకునే నార్త్ ప్రేక్షకులకు తెలుగువారి సత్తా ఏమిటో తెలిసింది.

PREV
16
నార్త్ ని ఏలేస్తున్న టాలీవుడ్... బాలీవుడ్ అనుమానాలు పూర్తిగా తీర్చేసిన ఆర్ ఆర్ ఆర్, పుష్ప! 
RRR- pushpa


బాహుబలి (Bahubali) విజయం పాన్ ఇండియా మూవీ అనే కాన్సెప్ట్ ని తెరపైకి తెచ్చింది. సినిమాకు ప్రాంతీయ,  భాషాబేధాలు ఉండవని నిరూపించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ స్టామినా ఏమిటో చాటి చెప్పాయి. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్(1&2) రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. 

26

వంద కోట్ల వసూళ్లను గొప్పగా చెప్పుకునే  ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్లు వసూళ్లు అసాధ్యం అనుకుంటే అది సుసాధ్యం చేసి చూపింది బాహుబలి 2. హిందీ చిత్ర పరిశ్రమలో బాహుబలి మూవీతో మొదటి అడుగు పడింది. సౌత్ నుండి మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కడానికి దారులు వేసింది. బాహుబలి స్ఫూర్తితో కొన్ని పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిన సక్సెస్ కాలేదు. ఒక్క కెజిఎఫ్ సిరీస్ మాత్రమే ఆ గౌరవం దక్కించుకుంది.

36

బాహుబలి విజయం గాలివాటమే అని బాలీవుడ్ నమ్మింది. అయితే పుష్ప(Pushpa), ఆర్ ఆర్ ఆర్ చిత్ర విజయాలతో వాళ్ళ నోళ్లకు తాళం పడింది. పుష్ప సక్సెస్ బాలీవుడ్ కి అనూహ్య పరిణామం. కనీస ప్రమోషన్స్ నిర్వహించని కారణంగా ఎటువంటి అంచనాలు లేకుండా పుష్ప విడుదలై సక్సెస్ కొట్టింది. మొదటి రోజు సుమారు రూ. 3 కోట్ల వసూళ్లు సాధించిన పుష్ప వంద కోట్ల టార్గెట్ దాటేస్తుందని ఎవరూ ఊహించలేదు. 

46

ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)తో రాజమౌళి మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ కొల్లగొట్టారు. ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ రన్ ముగిసే నాటికి రూ. 270 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నార్త్ ఇండియా ప్రేక్షకులు మరోమారు తెలుగు చిత్రానికి జై కొట్టారు. ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ వైపు పోటెత్తారు.

56


ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాల కారణంగా బాలీవుడ్ స్టార్స్ సినిమాలు వసూళ్లు కోల్పోయాయి. రణ్వీర్ సింగ్ నటించిన 83 మూవీ, అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే, జాన్ అబ్రహం అటాక్ చిత్రాలు ఈ రెండు తెలుగు చిత్రాల ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. అక్కడ స్టార్ హీరోలు వంద కోట్ల కోసం అల్లాడుతుంటే టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు అలవోకగా ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటున్నాయి. 

66
Rrr -Pushpa 2

రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్ పై పూర్తి ఆధిపత్యం సాధించిందనేది వాస్తవం. నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న తెలుగు చిత్రాలకు ఆదరణ దక్కుతుంది. తెలుగు సినిమాలో మంచి కంటెంట్ ఉంటుందనే ఓ అభిప్రాయానికి ప్రేక్షకులు రావడం జరిగింది. తెలుగు సినిమా అంటే థియేటర్స్ కి పరుగులు తీసేలా చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories