ఇప్పుడు మరో రూపంలోనూ తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా ఆమె నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. `ఓర్మాక్స్ మీడియా` ప్రకటించిన జాబితాలో ఆమె మొదటి స్థానంలో నిలవడం విశేషం. మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ జాబితాలో సమంత ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత అలియాభట్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార మూడో స్థానంలో, కాజల్ నాలుగు, దీపికా పదుకొనె ఐదు, రష్మిక ఆరు, కత్రినా ఏడు, అనుష్క ఎనిమిది, కీర్తిసురేష్ తొమ్మిది, త్రిష పదవ స్థానంలో నిలిచారు. పూజా, తమన్నా, ఐశ్వర్య, కరీనా, కంగనా వంటి హీరోయిన్లకి ఇందులో స్థానం దక్కకపోవడం గమనార్హం.