ఈరోజు ఎపిసోడ్లో జగతి బంధాల మధ్య గెలుపు ఓటమి లు ఉండవు అని అంటుంది. లేదు జగతి ఇన్ని రోజులు మనం రిషిని బాధ పెట్టాము కానీ మనం అనుకున్నది సాధించలేకపోయాము అని అంటాడు మహేంద్ర. మహేంద్ర ఒకరకంగా చెప్పాలి అంటే దేవయాని అక్కయ్య ఓడిపోయింది. రిషి నిన్ను రమ్మన్నాడు నీకోసం ఎదురు చూస్తుంటాడు అని ధైర్యం చెబుతుంది జగతి. ఇంకేం మాట్లాడకు మహేంద్ర నీకోసం అక్కడ రిషి ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్దాం పద అని జగతి దంపతులు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు రిషి మహేంద్ర వస్తున్నాడు అన్న ఆనందంలో మహేంద్ర రూమ్ ని మొత్తం క్లీన్ చేస్తూ సర్దుతూ ఉంటాడు.