ప్రతి శుక్రవారం భయపడేదాన్ని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా.. : సమంత ఎమోషనల్

Published : Sep 12, 2025, 05:55 PM IST

Samantha: సమంత మయోసైటిస్‌తో పోరాడిన అనంతరం జీవితంపై దృష్ఠి పూర్తిగా మారిందని వెల్లడించారు. గతంలో బాక్స్‌ఆఫీస్ ఫలితాల వల్ల ప్రతీ శుక్రవారం టెన్షన్ గా ఫీల్ అయ్యే దాన్ని వెల్లడించారు. అభిమానులకు హెల్త్‌ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లు చేస్తోన్నట్లు చెప్పారు.

PREV
17
సినీ ప్రయాణం

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి 2010లో ‘ఏ మాయ చేసావే’అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా వచ్చిన బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మజిలీ వంటి చిత్రాలు ఆమె కెరీర్ లో బ్లాక్‌బస్టర్ హిట్స్ గా నిలిచాయి. స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ, అగ్రశ్రేణి దర్శకుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. 

27
స్టార్‌డమ్, పాన్ ఇండియా క్రేజ్

సమంత కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విజయ్, సూర్య, ధనుష్ వంటి హీరోల సరసన నటించి దక్షిణాదిలో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు హీరోయిన్‌గా కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా తన ప్రతిభను చూపించింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో రజీ పాత్రలో సమంత అద్భుత నటన కనబరిచి, పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సిరీస్ తర్వాత బాలీవుడ్ కూడా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. సమంత నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రతిభను చూపించింది. కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రోత్సహిస్తూ నిర్మాతగా అడుగుపెట్టి కొత్త దారిని ఎంచుకుంది. ఈ విధంగా ఆమె నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

37
ఆర్యోగ సమస్యలు

సాఫీగా సాగుతున్న సమంత జీవితంలో ఒక్కసారిగా ఆర్యోగసమస్యలు తలెత్తాయి. 2022లో ఆమె మయోసైటిస్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈ వ్యాధి కారణంగా శరీర కండరాల్లో బలహీనత, నొప్పులు, అలసట ఏర్పడతాయి. ఈ వార్త బయటపడినప్పుడు ఆమె అభిమానులు తీవ్రంగా కలత చెందారు.ఆ సమయంలో సమంత తన కెరీర్, జీవితం ఒక్కసారిగా కుదేలైపోయినట్టుగా భావించింది. వరుసగా సినిమాలు చేస్తూ, టాప్ హీరోయిన్స్ రేసులో పరుగులు పెడుతున్న సమయంలో ఈ సమస్య రావడంతో ఆమెతో మానసికంగా ఎంతో మదన పడింది.

47
ప్రతి శుక్రవారం భయమే

తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత తన భావోద్వేగాలను పంచుకుంది. గతంలో తన ఆలోచనలు, జీవనశైలి గురించి చెప్పుకొచ్చింది. “ఒకప్పుడు నాకు విజయమే అన్నీ అనిపించేది. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలి, ఏడాదిలో ఐదు సినిమాలు రిలీజ్ చేయాలి, టాప్ టెన్ హీరోయిన్ లిస్టులో ఉండాలి, బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ నంబర్లు తెచ్చుకోవాలి. ఇవే నా కలలు. ప్రతి శుక్రవారం ఒక భయం ఉండేది. రేపు ఎవరో నా స్థానాన్ని భర్తీ చేస్తారేమో?’ అనే టెన్షన్ ఉండేది. నా ఆత్మగౌరవం అంతా ఆ ఫలితాలపైనే ఆధారపడి ఉండేది,” అని ఆమె చెప్పింది.

57
జీవితం మీద కొత్త దృక్పథం

మయోసైటిస్ వ్యాధి తర్వాత సమంతలో పూర్తిగా మార్పు వచ్చింది. “గత రెండేళ్లుగా నా సినిమాలు రిలీజ్ కాలేదు. టాప్ లిస్టులో కూడా నేను లేను. అయినా నేను ఉన్నంతలోనే సంతోషంగా ఉన్నాను. డబ్బు, ఖ్యాతి, పేరు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణమని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ వ్యాధి నా జీవితం మీద దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. 

ఈ వ్యాధి సమంతకు కేవలం శారీరక సమస్యే కాదు, ఒక మానసిక పరీక్షగా కూడా నిలిచింది. ఎప్పుడూ కెరీర్, విజయాలు, పోటీలు మాత్రమే అనుకున్న ఆమె ఇప్పుడు జీవితం గురించి విస్తృత దృక్పథంతో ఆలోచిస్తోంది. నాలో వచ్చిన ఈ మార్పు నా జీవితంలోనే పెద్ద విజయంగా భావిస్తున్నాను” అని ఎమోషనల్‌ అయ్యింది.

67
అభిమానుల కోసం హెల్త్ పాడ్‌కాస్ట్

సమంత మాట్లాడుతూ “నా అభిమానులు చాలామంది నన్ను సినిమాల వల్ల, గ్లామర్ వల్ల ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. కానీ నేను అనుకున్నాను. వారికోసం వేరే దాంట్లోనూ ఏదైనా చేయాలని. అందుకే గతేడాది నుండి హెల్త్ ఫోకస్డ్ పాడ్‌కాస్ట్‌లు ప్రారంభించాను. ఆరోగ్యానికి సంబంధించిన సరైన సమాచారం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా అందరికీ అందించాలనుకున్నాను” అని తెలిపింది.

77
అప్ కమ్మింగ్ ప్రాజెక్టులు

సమంత ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న తన సినీ కెరీర్‌ను ఆపలేదు. ప్రస్తుతం ఆమె పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే పీరియాడిక్ డ్రామాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సమంత కెరీర్‌లో మరో మైలురాయిగా భావిస్తున్నారు. అలాగే.. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’అనే తెలుగు సినిమాలో కూడా సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు ఇప్పుడు అభిమానుల్లో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories