మే నెలకు సంబంధించి క్రేజ్, ఫాలోయింగ్, అభిమానం విషయంలో నిర్వహించిన సర్వేలో టాప్ 10లో సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత కాజల్, పూజా హెగ్డే, అనుష్క శెట్టి, కీర్తిసురేష్, తమన్నా, రష్మిక, సాయిపల్లవి, రకుల్, కృతి శెట్టి వరుసగా ఉన్నారు. ఈ లెక్కన సమంత యంగ్ సునామీలు రష్మిక, పూజా, కీర్తిసురేష్, సాయిపల్లవి, కృతి శెట్టి వంటి వారు కూడా ఆమె ఇమేజ్ ముందు వెనకబడిపోయారని చెప్పొచ్చు.