టైట్ ఫిట్ లో మిల్క్ బ్యూటీ అందాల మెరుపులు.. తమన్నా ఇలా కూడా అదరగొడుతోందిగా..

Sreeharsha Gopagani | Published : Nov 4, 2023 11:47 AM
Google News Follow Us

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. వరుస ప్రాజెక్ట్స్ లో సందడి చేస్తోంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ ల్లోనూ నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. 
 

16
టైట్ ఫిట్ లో మిల్క్ బ్యూటీ అందాల మెరుపులు.. తమన్నా ఇలా కూడా అదరగొడుతోందిగా..

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. తన అందం, డాన్స్, నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంది. ఇండస్ట్రీలోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
 

26

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎక్కువగా సందడి చేస్తోంది. మరోవైపు కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సందర్భంగా ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ సంచలనంగా మారుతోంది. రీసెంట్ గా వచ్చిన ‘లస్ట్ స్టోరీస్’, ‘జీ కర్దా’ చిత్రాలతో ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. 
 

36

ఇటు సౌత్ ఆడియెన్స్ నూ అలరిస్తోంది. ‘జైలర్’, ‘భోళా శంకర్’ చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూనే వస్తున్న తమన్నా భాటియా.. మరోవైపు సమయం దొరికితే యాడ్ షూట్లు కూడా చేస్తోంది. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తోంది. 

Related Articles

46

తాజాగా ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఫొటోషూట్ చేసింది. రెడ్ బాడీకాన్ డ్రెస్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. ఓ వైపు మెరిసిపోయే అందంతో మైమరిపిస్తూనే.. మరోవైపు బిగుతైన సొగసుతో మతులు చెడగొట్టింది. ఈ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.

56

అలాగే తమన్నా.. చిలె వాల్ నట్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ కనిపించింది. బ్రెయిన్ ఫూడ్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది. క్వాలిటీ, క్వాంటినీలో ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా బ్యూటీఫుల్ దేశీ వేర్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ లో ఆకట్టుకుంది. 
 

66

అటు సినిమాలు.. ఇటు కమర్షియల్ యాడ్స్ లలోనూ నటిస్తూ అదరగొడుతోంది. మొత్తానికి నయా లుక్స్ లో మెరుస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ‘బంద్రా’, హిందీలో Vedee చిత్రంలో నటిస్తోంది. 

Recommended Photos