`అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ రివ్యూ,

Published : Apr 18, 2025, 01:42 PM IST

Arjun Son of Vyjayanthi Movie Review: కళ్యాణ్‌ రామ్‌ `బింబిసార` తర్వాత చేసిన చిత్రాలు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు మదర్‌ సెంటిమెంట్‌తో ఓ డిఫరెంట్‌ స్టోరీతో `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` చిత్రంలో నటించారు. ఇందులో విజయశాంతి ఆయనకు తల్లి పాత్రలో నటించడం విశేషం. ఆమె రీఎంట్రీ తర్వాత `సరిలేరు నీకెవ్వరు`లో నటించింది. ఆతర్వాత ఇప్పుడు ఈ మూవీలోనే మెరిసింది. ఆమె పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ వైజయంతిగా కనిపించబోతుండటం మరో విశేషం. విజయశాంతి పోలీస్‌గా అధికారి, కళ్యాణ్‌ రామ్‌ రౌడీగా కనిపిస్లారు. మరి వీరిద్దరు ఎలా ఆకట్టుకున్నారనేది `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`లో ఆసక్తికరం. 

PREV
16
`అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ రివ్యూ,
arjun son of vyjayanthi movie review

Arjun Son of Vyjayanthi Movie Review: నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా లేడీ అమితాబ్‌ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి`. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ పతాకాలపై అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మించారు. సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 18న) విడుదల అయ్యింది. మరి ఈసినిమాతో కళ్యాణ్‌రామ్‌కి హిట్‌ పడిందా? విజయశాంతి మళ్లీ వైజయంతిగా మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

26
arjun son of vyjayanthi movie review

కథః 
వైజయంతి(విజయశాంతి) పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఆమె ఎంతో మంది క్రిమినల్స్ ఏరిపారేస్తుంది. ఈ క్రమంలో నేషన్‌కి థ్రెట్‌గా ఉన్న క్రిమినల్‌ పఠాన్‌(సోహైల్‌ ఖాన్‌)ని కూడా అరెస్ట్ చేస్తుంది. తన పుట్టిన రోజు కూడా ఆమె రిస్కీ ఆపరేషన్స్ లో పాల్గొంటుంది. అమ్మంటే కొడుకు అర్జున్‌(కళ్యాణ్‌ రామ్‌)కి ఎంతో ఇష్టం. ఆమెకి బర్త్ డే విషెస్‌ చెప్పాల్సిన ప్రతిసారి ఆమె ఏదో ఒక ఆపరేషన్‌లోనే ఉంటుంది.

తమ పేరెంట్స్ కోరిక మేరకు తాను కూడా ఐపీఎస్ కావాలనుకుంటాడు. ఎగ్జామ్‌కి పది రోజుల ముందే తండ్రి చనిపోతాడు. తండ్రి మరణం వెనుక మహాంకాళి బ్యాచ్‌ హస్తం ఉందని తెలుస్తుంది. తన భర్త చంపిన వారిపై న్యాయపోరాటం చేసేందుకు వైజయంతి తన జాబ్‌కి రిజైన్‌ చేస్తుంది. మరోవైపు అమ్మ కోరిక మేరకు సివిల్‌ ఎగ్జామ్‌ రాస్తాడు అర్జున్‌. జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్‌ సాధిస్తాడు.

ఇక త్వరలోనే బాధ్యతలు తీసుకోవాల్సిన అర్జున్‌ మహాంకాళి తమ్ముడిని చంపేస్తాడు. దీంతో అంతా తలక్రిందులవుతుంది. మహాంకాళి మనుషుల నుంచి తప్పించుకుని వెళ్లి ఒక పేటలో స్థావరం పొందుతాడు అర్జున్‌. అక్కడి ప్రజలకు దేవుడిగా మారతాడు. పోలీస్ వ్యవస్థకి పారలల్‌గా క్రిమినల్స్ ని ఏరేస్తుంటాడు. కానీ అమ్మ అర్జున్‌ని ఛీ కొడుతుంది. తన కొడుకు ఇలా క్రిమినల్‌గా మారడం ఆమె బాధపడుతుంది.

కొడుకుపైనే న్యాయపోరాటం చేస్తుంటుంది. మరి అర్జున్‌ క్రిమినల్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పఠాన్‌తో వైజయంతికి గొడవేంటి? ఆమెని ఎందుకు చంపాలనుకున్నారు? అర్జున్‌, వైజయంతి మళ్లీ కలిశారా? కొత్తగా వైజాగ్‌ సిటీకి కమిషనర్‌గా వచ్చిన ప్రకాష్‌(శ్రీకాంత్‌) అసలు ఎవరు? ఈ క్రైమ్‌కి ఆయనకు సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ. 
 

36
arjun son of vyjayanthi movie review

విశ్లేషణః 
విజయశాంతి ఒకప్పుడు పవర్‌ ఫుల్‌ పోలీస్‌ రోల్స్ తో అదరగొట్టింది. తిరుగులేని లేడీ సూపర్‌ స్టార్‌ రాణించింది. ఆమె మళ్లీ ఇప్పుడు వైజయంతిగా వస్తే ఎలా ఉంటుంది? ఆమెకి కొడుకు జన్మిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందనేలా ఈ మూవీ ఉంటుంది. పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి. ఇటీవల కాలంలో మాస్‌, యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది.

హీరోలకు ఎలివేషన్లే మెయిన్‌ సినిమాలు ఉంటున్నాయి. ఆ కోవకే `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ చెందుతుంది. అయితే ఇందులో తల్లి సెంటిమెంట్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఇటీవల కాలంలో మదర్‌ సెంటిమెంట్‌తో సినిమాలు రావడం లేదు. ఆ కోణంలో ఇది కొంత కొత్తగా ఉందని చెప్పొచ్చు. గతంలో ఇలాంటి చిత్రాలు వచ్చాయి.

చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో దీన్ని రూపొందించారు. యాక్షన్‌ అంశాల పరంగా, మదర్‌ సెంటిమెంట్‌ కోణంలో సినిమా అదిరిపోయింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ని గతంలో ఎప్పుడూ లేని విధంగా చూపించారు దర్శకుడు. ఎలివేషన్లతో కళ్యాణ్‌ రామ్‌కి మరింత మాస్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చారు.

అదే సమయంలో విజయశాంతిని చాలా రోజుల తర్వాత పవర్‌ఫుల్‌ రోల్‌లో చూపించడం విశేషం. వింటేజ్‌ విజయశాంతి కనిపించారు. మరోసారి వైజయంతి చేసే రచ్చ ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. ఆయా ఎలిమెంట్లు సినిమాలో హైలైట్ గా నిలిచే అంశాలు. 
 

46
arjun son of vyjayanthi movie review

 సినిమా స్టోరీ రొటీన్‌గానే సాగుతుంది. స్క్రిప్‌ ప్లే కూడా రెగ్యూలర్‌గానే ఉంటుంది. ఆ విషయంలో కొత్తదనం లేదు. ఫస్టాఫ్‌లో అటు విజయశాంతి, ఇటు కళ్యాణ్‌ రామ్‌ పాత్రల పరిచయం, వాటిని ఎస్టాబ్లిష్‌ చేయడానికి చాలా టైమ్‌ తీసుకున్నట్టుగా ఉంటుంది. యాక్షన్‌ సీన్లు ఎక్కువగా ఉన్నాయి. సినిమాలో కథ కంటే ఫైట్ సీన్లకే ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంటుంది. మదర్‌ సెంటిమెంట్‌ని ఇంకా బలంగా ఎస్టాబ్లిష్‌ చేయాల్సింది.

దీంతో ఆయా సీన్లలో ఎమోషన్స్ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథలో చాలా చోట్ల ట్విస్ట్ లు డిమాండ్‌ చేశాయి. కానీ అలాంటి ఎలిమెంట్లు లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్‌లో సవాల్‌ విసురుకునే ఎపిసోడ్‌ బాగుంది. ఇక సినిమాలో మెయిన్‌ విలన్‌ పఠాన్‌ కంటే మహాంకాళికే ఎక్కువ ఎలివేషన్లు పడినట్టుగా ఉంటుంది. యాక్షన్‌ సీన్లు, కళ్యాణ్‌ రామ్‌ తన భార్యతో ఉండే సీన్లు, మదర్‌ సెంటిమెంట్‌ సీన్లని పారలల్‌గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా కథనాన్ని డిజైన్‌ చేశారు.

అదంతా ఒక ఫార్మాట్‌లో సాగుతున్నట్టు ఉంటుంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలను తలపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు ఇంకాస్త భిన్నంగా ఆలోచిస్తే బాగుంది. క్లైమాక్స్‌ మాత్రం సినిమాకి పెద్ద అసెట్‌. ఎన్టీఆర్‌ చెప్పినట్టు, విజయశాంతి చెప్పినట్టు క్లైమాక్స్ లో కళ్యాణ్‌ రామ్‌ వాహ్‌ అనిపించాడు. 

56
arjun son of vyjayanthi movie review

నటీనటులుః 
అర్జున్‌గా కళ్యాణ్‌ రామ్‌ రెచ్చిపోయి నటించాడు. నెగటివ్‌ షేడ్‌లో బాగా చేశాడు. యాక్షన్‌ సీన్లలో ఆయన మరింతగా రెచ్చిపోయాడు. మాస్‌ హీరోగా కళ్యాణ్‌ రామ్‌ని మరో మెట్టు ఎక్కించేలా ఈ మూవీ ఉంటుంది. ఇక విజయశాంతి చాలా కాలం తర్వాత యాక్షన్‌తో అదరగొట్టింది. అప్పటి విజయశాంతిని గుర్తు చేసింది. క్లైమాక్స్ లో ఆమె పాత్రకి ఇంకా బాగా రాసుకోవాల్సింది.

శ్రీకాంత్‌ పాత్రలోని ట్విస్ట్ బాగుంది. ఆయన కూడా తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ సాయీ మంజ్రేకర్‌ కాసేపు మెరిసింది. ఆమె పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. అలాగని గ్లామర్‌ పరంగానూ ఛాన్స్ లేదు. పఠాన్‌గా సోహైల్‌ ఖాన్‌ పాత్ర బలంగా ఉంది. కానీ ఆ స్థాయిలో ఆయనపై సీన్లని డిజైన్ చేయలేదనిపిస్తుంది. బబ్లూ పృథ్వీ కి మరో మంచి పాత్ర పడింది. బాగా చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

66
arjun son of vyjayanthi movie review

టెక్నీషియన్లుః 
సినిమాకి రామ్‌ ప్రసాద్‌ కెమెరామెన్‌. ఆయన విజువల్స్ బాగున్నాయి. రిచ్‌గా ఉన్నాయి. మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌లో అజనీష్‌ లోక్‌నాథ్‌ రెచ్చిపోయాడు. పెద్ద రేంజ్‌ మూవీస్‌కి ఏమాత్రం తక్కువ కాకుండా అందించారు. పాటలు కూడా బాగున్నాయి. చాలా కొత్తగా ఉన్నాయి. ఎడిటర్‌ తమ్మిరాజు ఎడిటింగ్‌ ఓకే, ఆయన కూడా ఇంకాస్త షార్ప్ చేయాల్సి ఉంది.

దర్శకుడు ప్రదీప్‌ తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించారు. కానీ రొటీన్‌ స్టోరీని ఎంచుకున్నాడు. కొత్తదనం ఏం లేదు. కాకపోతే ఆయన ఫోకస్‌ అంతా యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లపైనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ మాత్రం సక్సెస్‌ అయ్యాడు. జనరంజకంగానూ మూవీని రూపొందిస్తే, వాహ్‌ ఫ్యాక్టర్స్ మేళవింపుతో మూవీని తీస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలకు కొడవలేదు. 

ఫైనల్‌గాః యాక్షన్‌ లవర్స్ ని ఆకట్టుకునే మూవీ. తల్లీకొడుకుల సెంటిమెంట్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. 
రేటింగ్‌ః 2.75 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories