కుందనపు బొమ్మలా మెరిసిపోతూ సమంత కనువిందు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌.. గతాన్ని మర్చిపోలేకపోతుందా ?

First Published | Jan 4, 2022, 7:04 PM IST

సమంత స్ట్రాంగ్‌ ఉమెన్‌. ప్రేమ, పెళ్లి, బ్రేకప్‌తో తన జీవితంలో చేదు జ్ఞాపకాలను నింపుకుని బలమైన మహిళగా, సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా మారిపోయింది సమంత. తాజాగా ఆమె పంచుకున్న ఓ పోస్ట్ వైరల్‌ అవుతుంది. 

సమంత లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. భారీ డిజైనింగ్‌వేర్‌లో సమంత హోయలు పోయింది. కొంచె చూపులతో కనువిందు చేస్తుంది. చూపులతోనే కంపేస్తుందీ అందాల సోయగం. ప్రస్తుతం ఈ ట్రెడిషన్‌ వేర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
 

ఈ క్రమంలో మరికొన్ని లేటెస్ట్ పిక్స్ సైతం హల్‌చల్‌ చేస్తున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సమంత కొత్త యాంగిల్‌ అందాలను మెస్మరైజ్‌ చేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఏజ్‌ పెరిగే కొద్ది సమంత అందం మరింతగా పెరుగుతుండటం విశేషం. 


ఇదిలా ఉంటే చైతూతో విడిపోయిన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభవాలను వెల్లడిస్తుంది. కొన్ని సార్లు ఆమె ఫ్రస్టేట్‌ అవుతుంటే, మరికొన్నిసార్లు జీవిత పాఠాలను వెల్లడిస్తుంది. నెటి తరాన్ని ఇన్‌స్పైర్‌ చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎలా పెరగాలో చెబుతుంది సమంత. అమ్మాయిలు ఎలా ఉండాలని చెబుతూ గతంలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో ఆమె `సులభతరమైన గతం లేని దృఢమైన వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు` అని పేర్కొంది సమంత. ఈ పోస్ట్ ఎందుకు పెట్టిందనేది పెద్ద చర్చగా మారింది. ఆమె పోస్ట్ ని బట్టి చూస్తుంటే ఇంకా సమంత తన చేదు జ్ఞాపకాలను మర్చిపోలేకపోతుందని అంటున్నారు నెటిజన్లు. ఆమె తనని అవి వెంటాడుతున్న నేపథ్యంలో ఇలా పోస్ట్ ల రూపంలో పంచుకుంటుందని అంటున్నారు. 

ఏదేమైనా సమంత పెట్టే పోస్ట్ లో ఎంతో జీవిత సత్యాలుండటంతో వాటిని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకుంటున్నారు అభిమానులు. అనుభవంలో నుంచి వచ్చే మాటలు కచ్చితంగా నిజాలుగా ఉంటాయి. అదే సమయంలో స్ఫూర్తిని నింపేలా ఉంటాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలు, స్ట్రగుల్స్ అనుభవిస్తామో, వాళ్లు అంత స్ట్రాంగ్‌గా తయారవుతుంది. బలమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. ఇప్పుడు సమంత తన పోస్ట్ లో ఇదే విషయాన్ని చెప్పాలనుకుంటుందని తెలుస్తుంది. 

మరోవైపు తన స్నేహితులు  రాహుల్‌ రవీంద్రన్‌, కమెడియన్‌ వెన్నెల కిషోర్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. ఈ ఫొటోలో ముగ్గురూ రిక్లైనర్‌ సోఫాలో పడుకుని ఉండగా రాహుల్‌ సెల్ఫీ తీశాడు. ఈ ఫొటో స్టోరీలో షేర్‌ చేస్తూ 'మీరు లేకుండా నేను ఏం చేయగలను' అని రాసుకొచ్చింది సామ్‌. ఇది కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది.
 

ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యతో బ్రేకప్‌ తర్వాత కొంత గ్యాప్ తో రెచ్చిపోతుంది. ఆమె కెరీర్‌ని పరుగులు పెట్టిస్తుంది. ప్రస్తుతం సమంత చేస్తున్నన్ని సినిమాలు మరే కథానాయిక చేయడం లేదు. భిన్న భాషల్లో విభిన్నమైన సినిమాలు చేస్తుంది. ఓ రకంగా తన విశ్వరూపం చూపించబోతుంది. 
 

సమంత తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరోవైపు తమిళంలో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. వీటితోపాటు తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌ సినిమా చేస్తుంది. దీన్ని డ్రీమ్స్ వారియర్స్ సంస్థ నిర్మిస్తుంది. 
 

మరోవైపు ఫస్ట్ పాన్‌ ఇండియా సినిమా `యశోద`లో నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు.. తెలుగులో  ఎన్టీఆర్‌తో కొరటాల శివ చిత్రంలో, అలాగే మహేష్‌తో ఓ సినిమా చేయబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. హిందీలో షాహిద్‌ కపూర్‌తో ఓ చిత్రంలో, హృతిక్‌ రోషన్‌తో మరో సినిమా చేయబోతుందని టాక్‌. అలాగే ఓ ఇంటర్నేషన్‌ సినిమాకి కమిట్‌ అయ్యింది సమంత. ఇలా నటిగా తనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరిస్తుంది. ఓ రకంగా విజృంభిస్తోందని, తన విశ్వరూపం చూపించబోతుందని చెప్పొచ్చు. సమంత అంటే ఏంటో ఇప్పుడు తెలిసేలా చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

సమంత.. నాగచైతన్య కలిసి 2017 అక్టోబర్‌ 6న వివాహం చేసుకున్నారు. కొన్ని అనుకోని కారణాలతో నాలుగేళ్ల తర్వాత 2021 అక్టోబర్‌ 2న వీరిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే తాము విడిపోవడానికి కారణమేంటనేది మాత్రం వెల్లడించలేదు సమంత, నాగచైతన్య. దీంతో ఎవరికి వారు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

also read: టబు, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార.. ఒంటరి అందాల తారలు.. ఆ దారిలో సమంత?

Latest Videos

click me!