Samantha : విలన్ గానే బాగుందట.. మరోసారి నెగిటివ్ క్యారెక్టర్ లో సమంత

First Published | Jan 10, 2022, 7:25 AM IST

విలనిజంపై మోజు పెంచుకుంటుంది స్టార్ హీరోయిన్ సమంత. గ్లామర్ పాత్రల నుంచి నెగెటీవ్ క్యారెక్టర్ వైపు వెళ్తుంది. కెరీర్ లో దూకుడు పెంచిన సామ్.. ఇఫ్పుడు మరోసారి విలన్ పాత్రలోమెరవబోతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) డిఫరెంట్ పాత్రలవైపు పరుగులు తీస్తుంది. గ్లామర్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన సమంత ఇప్పుడు విమెన్ సెంట్రిక్ మూవీస్  తో హడావిడి చేస్తుంది. అంతే కాదు కొత్తగా అనిపించిన పాత్ర ఏదైనా చేయడానికిసై అంటుంది సామ్. అది హీరోయిన్ గా అయినా.. విలన్ క్యారెక్టర్ అయినా సరే వెనకడుగు వేసే ప్రస్తక్తే లేదంటుంది.

లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ మెన్ సిరిస్ 2(family man season 2 )లో నెగెటీవ్ క్యారెక్టర్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంద సమంత(Samantha). ఆ సిరిస్ కు అంత ఆధరణ రావడంతో అప్పటి నుంచి తాను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తానంటూ చెప్పేసింద కూడా. అనుకున్నట్టుగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలక్ట్ చేసుకుని మరీ సినిమాలు చేస్తుంద సమంత. రీసెంట్ గా హాలీవుడ్ మూవీ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలో బైసెక్సువల్ క్యారెర్టర్ చేయబోతోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించింది సమంత.


ఇక అలానే.. టాలీవుడ్ లో శాకుంతలం,యశోద మూవీలను చేస్తుంది సామ్.  వాటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నయనతార(Nayanthara) కాంబినేషన్ లో సమంత ఓ మూవీ చేస్తుంది. కాత్తువాక్కుల రెండు కాదల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఖతిజా పాత్రలో నటిస్తున్నట్టు గతంలోనే  పోస్టర్ ద్వారా ప్రకటించారు టీమ్.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇది నెగెటీవ్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ మూవీలో విలన్ గా సమంత అలరించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి-నయనతార ప్రేమికుల పాత్రల మధ్య సమంత చిచ్చుపెట్టే నెగెటీవ్ రోల్ ఖతిజా అంటూ కోలీవడ్ లో చర్చ నడుస్తుంది. ఫ్యామిలీ మెన్2 (family man season 2 )లో రాజీగా నెటెగీటీవ్ పాత్రలో అలరించిన సమంత.. ఖతిజాగా ఎంత విలనిజం చూపిస్తుందో చూడాలని  ఆడియన్స్ తహతహలాడుతున్నారు.

నాగచైతన్య(Naga Chaitanya) తో డివోర్స్ తరువాత సినిమాల విషయంలో దూసుకుపోతోంద సమంత(Samantha). వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది. ఆలోచనలను మార్చుకుని.. సినిమాల వైపు మళ్శిస్తోంది. బిజీగా గడుపుతోంది సమంత. ఫ్రెండ్స్ తో టూర్స్ ప్లాన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత(Samantha). గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింద. ఇక బాలీవుడ్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది బ్యూటీ. త్వరలో బాలీవుడ్ సినిమాలపై క్లారిటీ ఇవ్వబోతోంది. ఇటు టాలీవుడ్ లో కూడా మరికొన్ని ఆఫర్స్ చేతిలో పెట్టుకుంది. వరుసగా వాటిని కంప్లీట్ చేయబోతుంది.

Latest Videos

click me!