పైకి అందంగా కనిపించే హీరోయిన్స్ జీవితాలలో చెప్పుకోలేని ఇబ్బందులు ఉంటాయి. కోట్ల సంపాదన లగ్జరీ లైఫ్ వాళ్ళకేంటి అనుకుంటాం కానీ.. మానసికంగా శారీరకంగా వారికుండే కష్టాలు అనేకం. ఒక సమయం అంటూ లేని జాబ్ వాళ్ళది. ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకే తెలియదు.
ఈ గజిబిజి లైఫ్ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా మంది స్టార్ హీరోయిన్స్ మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతారు. ఇలా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం
29
samanta
స్టార్ లేడీ సమంత ఆటో ఇమ్యూన్ కారణంగా మయోసైటిస్ బారినపడ్డారు. మయోసైటిస్ కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. గతంలో సమంత స్కిన్ సమస్యలకు గురయ్యారు.
39
లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక దశలో తీవ్ర స్కిన్ అలర్జీ సమస్యతో బాధ పడ్డారు. మేకప్ కారణంగా ఆమెకు ఈ వ్యాధి సోకింది. చికిత్స తర్వాత ఆమె తిరిగి కోలుకున్నారు.
49
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దీపికా పదుకొనె చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. రన్బీర్ కపూర్ తో లవ్ బ్రేకప్ కారణంగా దీపికా డిప్రెషన్ కు గురైనట్లు సమాచారం. చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె బయటపడలేక పోతున్నారట.
59
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆంగ్జైటీ బారిన పడ్డారు. ఈ మానసిక రోగం ఉన్న వారు చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళనకు గురవుతారు. ఏదో జరిగిపోతుందన్న భావనలో ఉంటారు.
69
హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. ఆమె కొన్నాళ్లు ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు.
79
parineeti chopra
ప్రియాంక చోప్రా చెల్లి పరిణితి చోప్రా సైతం మానసిక రుగ్మతతో బాధపడ్డారు. చాలా కాలం ఆమె డిప్రెషన్ కి గురి కావడం జరిగింది. చికిత్స అనంతరం బయటపడినట్లు సమాచారం.
89
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా చాలా కాలం బాడీ డిస్మార్ఫిక్ డిజాస్టర్ తో బాధపడ్డారు. ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజాస్టర్ వచ్చిన వారు తన శరీరం, అందం గురించి బాధపడుతూ ఉంటారు. తాను అందంగా లేనని ఆందోళన చెందుతూ ఉంటారు.
99
సీనియర్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ కి చిన్న వయసులోనే డయాబెటిస్ సోకింది. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నారు.