వారసుడు చేతిలో వారసుడు...మొదటిసారి లీకైన నిర్మాత దిల్ రాజు కుమారుడి ఫోటో! 

Published : Nov 01, 2022, 02:51 PM IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లేటు వయసులో వివాహం చేసుకున్నారు. పురుష సంతానం లేని దిల్ రాజు రెండో భార్యతో ఆ కల నెరవేర్చుకున్నాడు. దిల్ రాజుకు కొడుకు ఫోటో మొదటిసారి బయటకు వచ్చింది.   

PREV
15
వారసుడు చేతిలో వారసుడు...మొదటిసారి లీకైన నిర్మాత దిల్ రాజు కుమారుడి ఫోటో! 
Dil Raju


దిల్ రాజ్ సతీమణి అనిత 2017లో అనారోగ్యంతో మరణించారు. సతీమణి మరణంతో ఆయన తీవ్ర వేదనకు గురయ్యారు. దిల్ రాజు భార్య పేరున అనేక హిట్, బ్లాక్ బస్టర్ చిత్రాలు సమర్పించారు. అనిత-దిల్ రాజులకు ఒక కుమార్తె, ఆమె వివాహం అనంతరం అమెరికాలో ఉంటున్నారు. 
 

25
Dil Raju

అనిత మరణం తర్వాత దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారు. అయితే 2020లో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి టాలీవుడ్ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. యాభై ఏళ్ల వయసులో దిల్ రాజు రెండో వివాహం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

35
Dil Raju

అయితే జ్యోతిష్యుల సలహా మేరకు దిల్ రాజు ఈ వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అలాగే ఆయనకు పురుష సంతానం లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పెద్ద సామ్రాజ్యం సృష్టించిన దిల్ రాజుకు వారసుడు లేదన్న ఆవేదన ఉంది. 
 

45
Dil Raju


ఈ రెండు కారణాలతో దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్నారు. దిల్ రాజు కోరుకున్నట్లే ఈ ఏడాది ఆయనకు కొడుకు పుట్టాడు. దీంతో దిల్ రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దిల్ రాజు కొడుకు ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా దిల్ రాజు వారసుడు ఎలా ఉంటాడో రివీల్ అయ్యింది. 
 

55

కోలీవుడ్ స్టార్ విజయ్ చేతుల్లో దిల్ రాజు కొడుకు దర్శనమిచ్చాడు. వారసుడు చిత్ర సెట్స్ దిల్ రాజు తన కొడుకును తీసుకు రావడంతో విజయ్ పిల్లాడిని చేతుల్లోకి తీసుకొని ముద్దాడాడు. ఆ సమయంలో ఎవరో ఫోటో క్లిక్ మనిపించారు. సదరు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిల్ రాజు కుమారుడిని చూసిన నెటిజెన్స్ సూపర్ క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories