నాగార్జునపై `సమంత- చై బ్రేకప్‌` ప్రభావం.. అదే ఎఫెక్ట్ `బిగ్‌బాస్‌5`పై కూడా పడిందా ?

Published : Sep 05, 2021, 08:25 PM IST

కింగ్‌ నాగార్జున ఓ విషయంలో భయపడుతున్నారు. `బిగ్‌బాస్‌5`కి ముందు మీడియా ముందుకు వచ్చేందుకు భయపడ్డారు. అందుకే `బిగ్‌బాస్‌` ఐదో సీజన్‌ ప్రారంభానికి ముందు దూరంగా ఉన్నారు. మరి ఆయన్ని భయపెడుతున్న అంశమేంటి? 

PREV
16
నాగార్జునపై `సమంత- చై బ్రేకప్‌` ప్రభావం.. అదే ఎఫెక్ట్ `బిగ్‌బాస్‌5`పై కూడా పడిందా ?

బిగ్‌బాస్‌5 సీజన్‌ నాగార్జున హోస్ట్ గా ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కోట్లాది మంది ఆడియెన్స్ ఎదురుచూస్తుండగా, గ్రాండ్‌గా ఈ షో లాంచ్‌ అయ్యింది. నాగ్‌ తనదైన స్టయిల్‌లో డాన్సులు చేసి ఫిదా
చేశారు. `ఒక లైలా కోసం.. `అంటూ, `మాస్‌.. `అంటూ దుమ్మురేపాడు. ఇక వరుసగా కంటెస్టెంట్లని పరిచయ కార్యక్రమం జరుగుతుంది. 

26

ఈ నేపథ్యంలో నాగార్జునకి సంబంధించిన ఓ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అదే ఆయన తనయుడు,హీరో  నాగచైతన్య, సమంతల మ్యాటర్‌. 

36

వీరిద్దరి విడిపోతున్నారంటూ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాగ్‌ ఫ్యామిలీతో సమంతకి చెడిందని, దీంతో కొంత కాలంగా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.

46

దీంతోపాటు సమంత రకరకాల పోస్ట్ లు పెడుతూ వస్తోంది. చైతన్యతో డైవర్స్ తీసుకుంటుందని, అందుకే దూరంగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. దీనికి బలం చేకూరేలా సమంత పోస్ట్ లు పెట్టడం, అనేక అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే చై, సామ్‌ విడిపోతున్నారని ప్రచారం జరుగుతుంది. 
 

56

దీంతో  ఈ విషయంపై తాను మీడియాని ఫేస్‌ చేయడం కష్టమని భావించి `బిగ్‌బాస్‌5`కి ముందు మీడియా మీట్‌కి దూరంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ మీట్‌ని దూరంగా ఉన్నట్టు నిర్వహకులు తెలిపినా, అసలు నిజం ఇదే అని అంటున్నారు. 
 

66

ఇలా సమంత, నాగచైతన్యల డైవర్స్ మ్యాటర్‌ నాగార్జునపైనే కాదు, ఇప్పుడు పరోక్షంగా `బిగ్‌బాస్‌5`పై కూడా పడిందని చెప్పొచ్చు. మరి రియల్‌లైఫ్‌లో ఏం జరుగుతుందో గానీ ఇప్పుడు సమంత, చైల మ్యాటర్‌ `బిగ్‌బాస్‌5`కి కూడా తాగిందని చెప్పొచ్చు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories