RRR New Record: ఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్ ల పరంపర, లేటెస్ట్ గా ఖాతాలో మరొకటి

Published : May 06, 2022, 03:21 PM IST

రిలీజ్ అయ్యి నెలరోజులకు పైనే అవుతున్నా.. ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ల పరంపర మాత్రం ఆగడం లేదు. రాజమౌళి అద్భుత సృష్టికి సరికొత్త రికార్డ్ లు సలాం అంటున్నాయి. రీసెంట్ గా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది ట్రిపుల్ ఆర్.   

PREV
16
RRR New Record: ఆగని ఆర్ఆర్ఆర్ రికార్డ్ ల పరంపర, లేటెస్ట్ గా ఖాతాలో మరొకటి

ఆర్ఆర్ఆర్ హ‌వా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. టాలీవుడ్  జ‌క్క‌న్న చెక్కిన ఈ దృశ్య కావ్యాన్ని చూసేందుకు ఆడియన్స్ ఇంకా థియేటర్లకు పరుగులు  తీస్తూనే ఉన్నారు. వీకెండ్స్ లో ఆర్ ఆర్ ఆర్ ఉన్న థియేటర్లు హౌస్ ఫుల్ అవుతుంటే.. మిగతా రోజుల్లో కూడా  మంచి ఆక్సుపెన్సీని సాధిస్తుంది ఈ సినిమా 

26

వసూళ్ళ వర్షం కురిపించిన ఆర్ఆర్ఆర్  కలెక్షన్లు  ఇప్ప‌టికి స్ట‌డీగానే ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యి  న‌ల‌భై రోజుల దాటినా కొన్ని చోట్ల మంచి వ‌సూళ్ళే వస్తున్నాయి. చ‌ర‌ణ్‌, తార‌క్‌ల న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం జైజైలు కొట్టారు. ఇండియాలో వ‌రుస‌గా రెండు సార్లు 1000కోట్ల క్ల‌బ్‌లో చేరిన ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డు సృష్టించాడు. 

36

అంతే కాదు దేశం మొత్తం మీద కొన్న అరుదైన న రికార్డ్స్  క్రియేట్ చేస్తోన్న ట్రిపుల్ ఆర్ ... నైజాంలో 100కోట్ల మార్కును ట‌చ్ చేసిన మొద‌టి సినిమాగా  ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఒక్క‌టేమిటి  ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో రికార్డుల‌ను ట్రిపుల్ఆర్ బ్రేక్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మరో రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ తన సోంతం చేసుకుంది.

46

100 డేస్ సినిమాలకు పెట్టింది పేరైనా ఆర్‌టీసి క్రాస్ రోడ్‌లో ట్రిపుల్ఆర్  అరుదైన‌ ఘ‌న‌త‌ను సాధించింది. ఇక్కడ సినిమా రిలీజ్ అంటే  ఇండస్ట్రీకి సెంటిమెంట ఉంటుంది. అటువంటిది ట్రిపుల్ ఆర్ ఇక్కడే ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ  సినిమా 5కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. వ‌రుస‌గా 4, 5 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా నిలిచింది. 
 

56

ట్రిపుల్ ఆర్ తరువాత  స్థానాల్లో వ‌రుస‌గా 3.76కోట్లతో బాహుబ‌లి-2 ,2.41 కోట్లతో  రంగ‌స్థ‌లం సినిమాలు ఉన్నాయి . అంతే కాదు ఈసినిమాతో  ప్ర‌భాస్ త‌రువాత‌ తార‌క్‌, చ‌ర‌ణ్‌లు 1000కోట్ల క్ల‌బ్‌లో నిలిచిన హీరోలుగా అవతరించారు. ట్రిపుల్ ఆర్ తో ఈ ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ను సుస్థిరం చేసుకున్నారు
 

66

ఇక ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ లో తార‌క్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించగా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టించాడు. బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా మొర్రీస్‌లు హీరోయిన్ గా న‌టించారు.

click me!

Recommended Stories