నాగార్జున బర్త్ డే పార్టీలో సమంత మిస్సింగ్‌.. మళ్లీ ఊపందుకున్న రూమర్లు ?

Aithagoni Raju | Updated : Aug 31 2021, 08:25 PM IST
Google News Follow Us

సమంత ఇప్పుడు తరచూ వార్తల్లో నిలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీకి, తనకు పడటం లేదని, ముఖ్యంగా మామ నాగార్జునతో పడటం లేదని, అలాగే నాగచైతన్యకి దూరంగా ఉంటుందనే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 
 

17
నాగార్జున బర్త్ డే పార్టీలో సమంత మిస్సింగ్‌.. మళ్లీ ఊపందుకున్న రూమర్లు ?

సమంత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ పేరులో అక్కినేని తీసేసి `ఎస్‌` అని యాడ్‌ చేసింది. సమంత రౌత్‌ ప్రభుగానే ఉంది. అక్కినేని అనే పేరు తీసేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. అయితే తాను నటిస్తున్న `శాకుంతలం` సినిమా వచ్చేలా తాను ఇలా పేరు మార్చిందనే వార్తలొచ్చాయి. 

 

27

అదే సమయంలో అక్కినేని బిజినెస్‌ వ్యవహారాల్లో ఆమె తలదూరుస్తుందని, అతిగా ఇన్‌వాల్వ్ అవుతుందని, అందుకే ఆమెని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు నాగచైతన్యతోనూ విభేధాలనే వార్తలు గుప్పుమన్నాయి. 
 

37

వీటన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ సమంత.. నాగార్జున పుట్టిన రోజు(ఆగస్గ్ 29)న ఆయన బర్త్ డే విషెస్‌ తెలిపింది. మామా అంటూ సంభోదించింది. దీంతో వీరి మధ్య ఏం లేవనే వార్తలు ఊపందుకున్నాయి. వీరి మధ్య క్లాషెస్‌ పుకార్లే అని తేలిపోయింది. 
 

Related Articles

47

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి విభేధాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం నాగార్జున బర్త్ డే పార్టీలో సమంత లేకపోవడం. నాగచైతన్య, అఖిల్‌, అమల, వారి దగ్గరి బంధువులు మాత్రమే ఉన్నారు. కానీ సమంత ఈ పార్టీలో లేదు. ఈ చిత్రాలను అఖిల్‌, అమల పంచుకున్నారు. 

57

ఫ్యామిలీ పార్టీలో సమంత లేకపోవడంతో మరోసారి రూమర్లు ఊపందుకున్నారు. చైతూ, సమంత `డైవర్స్` అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫ్యామిలీకి పెద్ద అయిన నాగ్‌ బర్త్ డే పార్టీలో సమంత లేకపోవడం నిజంగానే అనుమానాలకు తావిస్తుంది. 
 

67

మరోవైపు సమంత తన ఫ్రెండ్స్ తో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. శిల్పారెడ్డితో కలిసి ఆమె విహారయాత్రలు చేస్తుంది. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా సమంత పంచుకోవడం విశేషం. అత్యంత ముఖ్యమైన ఈవెంట్‌లో లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో సమంత చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. 

77

సమంత, చైతూ దూరంగా ఉంటున్నారా? వీరి మధ్య ఏదైనా మనస్పర్థాలు తలెత్తాయా? సమంత ఒంటరిగా ఇలా వెకేషన్‌కి వెల్లడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై నాగార్జునగా, చైతన్యగానీ, సమంతగానీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos