బాయ్ ఫ్రెండ్ ఒడిలో అప్పుడే పుట్టిన హీరోయిన్ కొడుకు... తండ్రి ఎవరో చెప్పాలంటూ జనాల డిమాండ్

బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఆగస్టు 25న మగ బిడ్డకు జన్మనిచ్చారు.  సోమవారం ఆమె డిశ్చార్జ్ కావడం జరిగింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళుతున్న సమయంలో ఆమె మీడియా కంటపడ్డారు. 

నుస్రత్ తన కుమారుడికి యిషాన్ అని పేరు పెట్టినట్లు సమాచారం అందుతుండగా, ఆ పేరు యష్ పేరుకు చాలా దగ్గరగా ఉండడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తుంది. నుస్రత్ బాయ్ ఫ్రెండ్ ఒడిలో ఆమెకుమారుడుని చూసిన జనాలు, అతని ఆ బిడ్డకు తండ్రినా అని అడుగుతున్నారు. అయితే తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పడం నుస్రత్ కి ఇష్టం లేదట. 


నుస్రత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్నారని తెలుసుకున్న జనాలు వందల సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారట. బయటికి వచ్చిన ఆమె వాళ్లకు అభివాదం చేస్తూ... కారులో వెళ్లిపోయారు. అప్పుడే ఆమె బిడ్డ యశ్ దాస్ గుప్తా చేతిలో ఉండడం జనాలు గమనించారు. 



యష్, నుస్రత్ ఒకే కారులో బిడ్డతో సహా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే బిడ్డ ముఖం  కనిపించకుండా వీరిద్దరూ జాగ్రత్త పడ్డారు. ఇక కొన్నాళ్లుగా యష్, నుస్రత్ ఎఫైర్ హాట్ టాపిక్ గా ఉంది. భర్త నిఖిల్ జైన్ తో విడిపోయిన నాటి నుండి నుస్రత్ యష్ తో సన్నిహితంగా  ఉంటున్నారు. 


అందుతున్న సమాచారం ప్రకారం నుస్రత్ డెలివరీ సమయంలో యష్ ఆసుపత్రిలోనే ఉన్నారట. ఇక నుస్రత్ సింగిల్ మదర్ గానే ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 


2019 జూన్ 19న బిజినెస్ మాన్ నిఖిల్ జైన్ ని నుస్రత్ వివాహం చేసుకున్నారు. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. 

Latest Videos

click me!