Samantha: కరణ్ షోలో విడాకులు విషయం కుండబద్దలు కొట్టిన సామ్? ... నాగ్ ఫ్యామిలీలో కలవరం!

Published : Jun 20, 2022, 11:30 AM IST

కాఫీ విత్ కరణ్ అత్యంత వివాదాస్పద షోగా పేరుగాంచింది. దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా చాలా కాలంగా ఈ షో ప్రసారం అవుతుంది. ఇక లేటెస్ట్ సీజన్ త్వరలో మొదలుకానుండగా చిత్రీకరణ జరుగుతుంది. ఈ వివాదాస్పద షోలో పాల్గొన్న సమంత విడాకులపై పెదవి విప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

PREV
17
Samantha: కరణ్ షోలో విడాకులు విషయం కుండబద్దలు కొట్టిన సామ్? ... నాగ్ ఫ్యామిలీలో కలవరం!
Samantha

సమంత-నాగ చైతన్య (Samantha-Naga Chaitanya Divorce)ఎందుకు విడిపోయారు?... ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ జంట 2017లో ఘనంగా రెండు సాంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లు హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవించారు. 2021లో వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి.

27


విడిగా ఉంటున్నట్లు తెలుసుకున్న మీడియా నాగ చైతన్య, సమంత(Samantha) విడాకులు అంచనా వేయడం జరిగింది. అధికారిక ప్రకటనకు ముందే సమంత-చైతూ విడిపోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. 2021లో అక్టోబర్ లో సమంత, చైతూ అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్స్ తో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

37


ఇక్కడ జనాలకు విడాకుల కంటే దానికి దారి తీసిన కారణాలే కావాలి. ఈక్రమంలో పలు పుకార్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంతపై విమర్శలు వెల్లువెత్తాయి. సినిమాల ఎంపిక, డ్రెస్సింగ్ స్టైల్ నాగ చైతన్యకు నచ్చడం లేదని, అలాగే ఆమె పిల్లల్ని కనాలని కోరుకోవడం లేదని కొన్ని కథనాలు వెలువడ్డాయి. 
 

47

సమంత ఎదుర్కొన్న మరొక ప్రధాన ఆరోపణ తన పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్. వివిధ సందర్భాల్లో సమంత, ప్రీతమ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటికి తీసి వాళ్లకు ఎఫైర్ అంటగట్టారు. దీంతో ప్రీతమ్ సోషల్ మీడియా వేధింపులు ఎదుర్కొన్నాడు. చివరికి సమంతను నేను అక్కగా భావిస్తాను అంటూ వివరణ ఇచ్చుకున్నారు.

57


విడాకులకు దారి తీసిన వివాదం మాత్రం పెద్దదే. దానికి సమంత సోషల్ మీడియా పోస్ట్స్ రుజువు. సమంత పరోక్ష పోస్ట్స్ ద్వారా నాగ చైతన్యపై తన అక్కసు వెళ్లగక్కింది. విడాకుల తర్వాత వరుసగా ఆమె నాగ చైతన్యను టార్గెట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో కొన్ని కొటేషన్స్ షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన సదరు పోస్ట్స్ లో కనిపించేది. 

67

అసలు విడాకుల నిర్ణయం ఎవరిది? ఇద్దరిలో తప్పు చేసింది ఎవరు? సమంత ఆవేదన వెనుక కారణం ఏమిటో? త్వరలో తెలియనుందన్నట్లు సమాచారం. కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ (coffe with Karan)షోలో ఈ విషయాలపై సమంత కుండబద్దలు కొట్టారట. విడాకులకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో ఓపెన్ గా చెప్పేశారట. సమంతకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి కాగా త్వరలో ప్రసారం కానుందట. 
 

77
Samantha

ఆ బోల్డ్ షోలో సమంత పచ్చి నిజాలు బయటపెడితే నాగ్ ఫ్యామిలీకి చిక్కులు తప్పవు. ఆమె డిప్లొమాటిక్ గా కాకుండా నాగ చైతన్యపై ఆరోపణలు చేసిన క్రమంలో మరోవివాదం మొదలవుతుంది. కాఫీ విత్ కరణ్ షోలో సమంత ఏం మాట్లాడారనే ఉత్సుకత పెరిగిపోయింది. అయితే కరణ్, నాగార్జున అత్యంత సన్నిహితులు కాగా... ఆ ఫ్యామిలీ పరువు పోయే పని కరణ్ చేస్తారంటే నమ్మలేం. చూడాలి ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎంత మేర నిజం ఉందో...

Read more Photos on
click me!

Recommended Stories