దేవి గురించి ఆలోచిస్తున్న అని చెప్పడంతో సత్య షాక్ అవుతుంది. ఏంటి అని అడిగితే దేవుడమ్మ అమ్మ గురించి ఆలోచిస్తున్న అని మాట మారుస్తాడు. నువ్వు ఆలోచించిన ఉపయోగం లేదు అని సత్య అంటే ఆలోచనలు ఆపలేం అని పడుకుంటాడు. ఇక మరోవైపు దేవి, చిన్మయికు వాళ్ళ అవ్వ భోజనం పెడుతుంది. అప్పుడే వాళ్లందరితో ఆనందంగా మాట్లాడుతూ కూర్చుంటుంది. మాధవకు స్పెషల్ గా బాయ్ చెప్పి వెళ్తుంది.