ఆకర్షణీయమైన జ్యూయెల్లరీలో మెరిసిపోతున్న సమంత.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న సామ్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని వెల్లడించిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటోంది. పూర్తిగా కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఈ సమయంలోనే సమంత తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ వస్తోంది. మొన్నటి వరకు టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేసింది. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ రిలాక్స్ అయ్యింది. తన హెల్త్ రికవరీ చేసుకునేందుకు ప్రయత్నించింది.
 


ఈ క్రమంలో సామ్ నెట్టింట నిత్యం అప్డేట్స్ అందిస్తూనే వస్తోంది. మరోవైపు ఆయా కార్యక్రమాలకు కూడా హాజరవుతోంది. అలాగే తన బ్యూటీఫుల్ లుక్స్ తోనూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. అందంతోనూ ఆకట్టుకుంది.
 

తాజాగా సమంత పంచుకున్న కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత యాడ్ ఫొటోషూట్ చేసింది. సీఎంఆర్ జ్యూయెల్లరీ  కోసం చేసిన ఫొటోషూట్ తో ఆకట్టుకుంది. ఆ ఫొటోలను తాజాగా పంచుకుంది.
 

ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించి మెరిసిపోయింది. ఆమె రూపసౌందర్యానికి తగిన జ్యూయెల్లరీతో వెలిగిపోయింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

ఇక సామ్ రీసెంట్ గా ‘ఖుషి’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుందీ చిత్రం. నెక్ట్స్ క్రేజీ సిరీస్ Citadel తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ లీడ్ గా నటించారు. 
 

Latest Videos

click me!