టైట్ ఫిట్ లో యాపిల్ బ్యూటీ కిల్లింగ్ స్టిల్స్.. హన్సికా బ్యూటీఫుల్ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే..

First Published | Oct 9, 2023, 4:16 PM IST

‘దేశముదురు’ హీరోయిన్ హన్సికా మోత్వానీ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.  ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన హన్సికా మోత్వానీ (Hansika Motwani) టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ ముద్దుగుమ్మను టాలీవుడ్ కు పరిచయం చేశారు.  అల్లున్ హీరో గా వచ్చిన ‘దేశముదురు’లో హన్సికా నటించిన విషయం తెలిసిందే.
 

తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంత్రి, మస్కా, బిల్లా, కందిరీగ, హో మై ఫ్రెండ్, వపర్, గౌతమ్ నంద లాంటి సినిమాలతో మరింతగా మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో గుర్తుండిపోయేలా చేసింది. అటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే వస్తోంది.
 


అయితే, గతేడాది డిసెంబర్ 4న హన్సికా మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను అదరగొడుతోంది. 
 

ఈ క్రమంలోనే హన్సికా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా చాలా దగ్గరగా ఉంటోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఖుషీ చేస్తోంది. అలాగే తన గ్లామర్ ఫొటోలతోనూ మెస్మరైజ్ చేస్తోంది. నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. కుర్ర హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా దర్శనమిస్తోంది. 
 

తాజాగా హన్సికా టైట్ ఫిట్ లో మెరిసింది. అవుట్ ఫిట్ లుకింగ్ సూపర్ అనిపించింది. సింపుల్ గా ఉన్నా స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హన్సికా మతులు పోయేలా ఫోజులిచ్చింది. కిర్రాక్ స్టిట్స్ తో కట్టిపడేసింది. తన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఫిదా చేసింది. 

ఇక హన్సికా అప్ కమింగ్ ఫిల్మ్స్ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో 105 మినిట్స్, మై నేమ్ ఇజ్ శృతి చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్, గాంధరి, మ్యాన్ వంటి సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో హన్సికా బిజీగా ఉంది.
 

Latest Videos

click me!