టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ సమయాన్ని తన పూర్తి ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. ఈమేరకు ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో సందడి చేస్తోంది.
నేచర్ కు దగ్గరగా ఉంటూ ప్రశాంతతను పొందుతోంది. పని ఒత్తిడి, తదితర టెన్షన్ల కు దూరంగా ఉంటూ రిలాక్స్ అవుతోంది. ముఖ్యంగా తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సామ్ ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్ వస్తోంది. తను తిరిగి సాధారణ స్థితి వస్తున్నట్టుగా వరుస పోస్టుల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. త్వరతో కోలుకొని సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.
తాజాగా తన వెకేషన్ నుంచి సామ్ కొన్నిచిత్రాలను పంచుకుంది. ప్రశాంత వాతావరణంలో సమయం గడుపుతున్నట్టుగా కనిపించింది. ఓ హోటల్ లోని పూల్ వద్ద ఒంటరిగా కూర్చొని రిలాక్స్ అవుతోంది. సింపుల్ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
అలాగే ఈ లేటెస్ట్ ఫొటోలను పంచుకుంటూ సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘బహుశా, బెస్ట్ టైం ఇంకా రావాల్సి ఉంది. అది మనం ఎప్పటికీ తెలుసుకోలేం’ అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. ఇది కోట్ తన జీవితాన్ని ఉద్ధేశించే పెట్టిందా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా సామ్ తన వెకేషన్ లో రిలాక్స్ అవుతున్నారు. మరింత జోష్ తో తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సామ్ - విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషీ’ వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రేజీ వెబ్ సిరీస్ ‘సిటడెల్’ కూడా రిలీజ్ కు సిద్ధం అవుతోంది.