సమంత ఈజ్ బ్యాక్.. మేకప్ లేకుండా షాకింగ్ లుక్ నెట్టింట వైరల్..ఇక యాక్షన్ లోకి దిగినట్లేనా..

First Published Jan 6, 2023, 1:01 PM IST

మాయోసైటిస్ వ్యాధి సోకిన తర్వాత సమంత యశోద ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించింది. అప్పుడు సామ్ చాలా నీరసంగా ఉన్నట్లు అనిపించింది. తాజాగా సమంత ముంబై విమానాశ్రయంలో వెళుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు సమంత యుఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. దీనితో సమంత చాలా కాలం అభిమానుల నుంచి, సినిమా షూటింగ్స్ నుంచి దూరంగా ఉంటోంది. 

అయితే ప్రస్తుతం సమంత పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ కూడా సమంత యశోద ప్రమోషన్స్ లో పాల్గొంది.  సమంత ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటిస్తున్న 'ఖుషి' చిత్రం ఆగష్టులో వాయిదా పడింది. తనకు మరికొన్ని రోజుల పాటు టైం కావాలని సమంత ఖుషి నిర్మాతలని రిక్వస్ట్ చేసిందట. 

ఇప్పుడు సమంత ఆరోగ్యం కుదుట పడడంతో యాక్షన్ లోకి దిగింది. సమంత తదుపరి చిత్రం 'శాకుంతలం' ఫిబ్రవరి 17న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ చిత్రానికి సమంత డబ్బింగ్ కూడా షురూ చేసింది. నెమ్మదిగా సామ్ తన వర్క్ పై ఫోకస్ పెడుతోంది. తాజాగా సమంత లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేసింది. 

మాయోసైటిస్ వ్యాధి సోకిన తర్వాత సమంత యశోద ప్రమోషన్స్ లో మాత్రమే కనిపించింది. అప్పుడు సామ్ చాలా నీరసంగా ఉన్నట్లు అనిపించింది. తాజాగా సమంత ముంబై విమానాశ్రయంలో వెళుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సామ్ మునుపటిలా యాక్టివ్ గా కనిపిస్తోంది. మేకప్ లేకుండా ఉన్న లుక్ లో అందరిని ఆశ్చర్యపరిచింది. 

కానీ స్టైల్ విషయంలో సమంత ఎక్కడా తగ్గలేదు. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ లో బాస్ లేడీ త్వరలో స్టైల్ తో అదరగొట్టింది. విమానాశ్రయంలో అభిమానులకు సెల్ఫీలు కూడా ఇచ్చింది. దీనితో సమంత ఇక యాక్షన్ లోకి దిగినట్లే అని అంతా భావిస్తున్నారు. 

మాయోసైటిస్ కారణంగా సమంత పలు చిత్రాల నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. అయితే అలాటిది ఏమీ లేదని తెలుస్తోంది. సామ్ ప్రస్తుతం సైన్ చేసిన చిత్రాలన్నీ ఫినిష్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో విజయ్ సరసన ఖుషీలో నటిస్తోంది. అలాగే హిందీలో వరుణ్ ధావన్ సరసన 'సిడాటెల్' అనే ప్రాజెక్టు చేస్తోంది. 

click me!