ఈరోజు ఎపిసోడ్ లో భాస్కర్ రావు, రామచంద్ర ఇంటి పత్రాలను తీసుకుని వెళ్లి కన్నబాబు చేతిలో పెట్టడంతో అవి చూసి సంతోష పడుతూ ఉంటాడు. మా అమ్మ చెప్పినట్లుగా చేసి చాలా మంచి పని చేశావు చాలా థాంక్స్ భాస్కర్ రావు అనడంతో మీ అమ్మగారు ఐడియా వల్లే నేను ఇలా చేశాను మూడు రోజులే గడువు ఇచ్చాను అనడంతో, రామచంద్ర గాడి ఫ్యామిలీ మూడు రోజుల్లో 25 లక్షలు అప్పు తీర్చలేదు అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు గతంలో జానకి ప్రవర్తించిన తీరుని తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు కన్నబాబు. ఆ జానకికి ఎంత ధైర్యం అంటే నాకు మా అమ్మకి చిటికె వేసి మరి వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా అని కన్నబాబు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.