సమంత, కాజల్‌, తమన్నా, అనుష్క, ప్రియమణి.. ఒకరు కాదు ఇద్దరు.. ఫ్యాన్స్ కి డబుల్‌ ట్రీట్‌

Published : Feb 13, 2022, 09:17 PM ISTUpdated : Feb 14, 2022, 03:44 PM IST

ఒక్క హీరోయిన్‌ని తెరపై చూస్తేనే ఆ అందాల కనువిందుని చూసేందుకు రెండు కళ్లు చాలవు. మరి ఒకే హీరోయిన్‌ని రెండు రకాలుగా చూస్తే.. అదొక విజువల్‌ ట్రీట్‌ అని చెప్పొచ్చు. మన హీరోయిన్లు అలాంటి డబుల్‌ విజువల్‌ ట్రీట్స్ నిచ్చారు.   

PREV
115
సమంత, కాజల్‌, తమన్నా, అనుష్క, ప్రియమణి.. ఒకరు కాదు ఇద్దరు.. ఫ్యాన్స్ కి డబుల్‌ ట్రీట్‌

జనరల్‌గా హీరోలు డబుల్‌ రోల్స్ అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ట్రెండ్‌ అవుతుంది. కానీ హీరోయిన్లు కూడా డబుల్‌ రోల్స్ తో మెప్పించారు. ఫ్యాన్స్ కి, ఆడియెన్స్ డబుల్‌ అందాల విందుని వడ్డించారు. డ్యూయెల్‌ రోల్స్ తో కనువిందు చేశారు. నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. మరి ఆయా కథానాయికలెవరో ఓ లుక్కేద్దాం. 
 

215

ఈ విషయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే అనుష్క ముందుంటారు. ఆమె ఏకంగా మూడు సినిమాల్లో డబుల్‌ రోల్స్ చేశారు. `అరుంధతి` చిత్రంలో మదర్‌గా, కూతురు అరుంధతి, జేజమ్మగా  మెస్మరైజ్‌ చేసింది. నట విశ్వరూపం చూపించింది. ఆ తర్వాత `పంచాక్షరి` చిత్రంలోనూ పంచాక్షరిగా, హనీగా రెండు విభిన్న పాత్రలతో మెప్పించింది. ఫాంటసీ చిత్రం `వర్ణ`లోనూ వర్ణగా, రమ్యగా కనువిందు చేసింది. 

315

స్టార్‌ సెన్సేషన్‌ సమంత సైతం రెండు పాత్రలు పోషించింది. ఆమె నటించిన తమిళ చిత్రం `10 ఎంథ్రాకుల్లా` లో షకీలగా, గాడ్గీ మోయి అనే రెండు పాత్రల్లో అలరించింది. వెండితెరపై కాసేపు మ్యాజిక్‌ చేసింది. 
 

415

కాజల్‌ కూడా ఆడియెన్స్ కి డబుల్‌ డోస్‌ పంచింది. ఆమె `మగధీర` చిత్రంలో మిత్రవిందగా, ఇందిరాగా రెండు పాత్రలు పోషించి మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ ని అబ్బురపరించింది. 

515

మిల్కీ బ్యూటీ తమన్నా సైతం రెండు పాత్రల్లో మెరిసింది. రామ్‌ నటించిన `ఎందుకంటే ప్రేమంట` చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేసి మెస్మరైజ్‌ చేసింది. 
 

615

త్రిష సైతం డ్యూయెల్‌ రోల్‌ పోషించింది. ఆమె తమిళంలో రూపొందిన `మోహిని` చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకుంది. ఘోస్ట్ మోహినిగా, వైష్ణవిగా అలరించింది. 
 

715

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న నయనతార సైతం ద్విపాత్రాభినయం చేసింది. `ఐరా` తమిళ చిత్రంలో ఆమె రెండు పాత్రల్లో మెరిసింది. భావని, యమునగా ఆకట్టుకుంది. 

815

`ఢీ` బ్యూటీ ప్రియమణి సైతం డబుల్‌ ట్రీట్‌నిచ్చింది. `చారులత` చిత్రంలో జంట కవలలు చారు, లత పాత్రల్లో నటించి ఆకట్టుకుంది. కష్టమైన పాత్రలో ఎంతో బాగా నటించి ప్రశంసలందుకుంది. 

915

 అచ్చ తెలుగు అమ్మాయి గా ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ అంజలి `గీతాంజలి` సినిమాలో ద్విపాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. `మసాలా`లోనూ డ్యూయెల్‌ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. 

1015

స్నేహా.. `పర్థిబన్‌ కనవు` అనే తమిళ సినిమాలో డ్యూయెల్‌ రోల్‌ చేసింది. ఇందులో అమాయకురాలిగా ఆమె నటన కట్టిపడేస్తుందని చెప్పొచ్చు. 

1115

నటి మీనా సైతం రెండు పాత్రలు పోషించారు. ఆమె `నడోడి మన్నన్‌`, `పడై వీటు అమ్మన్‌` చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసింది మెస్మరైజ్‌ చేసింది. ఆడియెన్స్ ని అలరించింది. 

1215

లేడీ సూపర్‌ స్టార్‌గా వెలుగొందిన విజయశాంతి సైతం డ్యూయెల్‌ రోల్స్ చేశారు. ఆమె `పోలీస్‌ లాకప్‌` చిత్రంలో డబుల్‌ డోస్‌తో మెస్మరైజ్‌ చేసింది. 

1315

`సుందరాంగుడు` చిత్రంలో జ్యోతిక సైతం డబుల్‌ రోల్‌ చేసింది. కనువిందు చేసింది. అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది. ఓ పాత్రలో వైకల్యంతో బాధపడుతున్న అమ్మాయిగా నటించింది.

1415

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన సిమ్రాన్‌ సైతం డ్యూయెల్‌ రోల్‌ పోషించింది. ఆమె తమిళంలో రూపొందిన `కనవే కలియదే` అనే సినిమాలో ద్విపాత్రాభినయం చేసింది. 

1515

వీరితోపాటు `దశావతారం` చిత్రంలో ఆసిన్‌ రెండు పాత్రల్లో కనిపించి మెప్పించింది. పీరియాడికల్‌ పాత్రలో, అలాగే మోడ్రన్‌ గర్ల్ గా మెరిసింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories