Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ ఫుడ్ ఏంటో తెలుసా.. నోరూరించే డిజర్ట్స్ ఫొటో షేర్ చేసిన కాజల్

Published : Feb 13, 2022, 06:54 PM IST

టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal). ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్.. పూర్తిగా హెల్త్ పై ఫోకస్ పెట్టింది. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమవుతోంది.  

PREV
16
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ ఫుడ్ ఏంటో తెలుసా.. నోరూరించే డిజర్ట్స్ ఫొటో షేర్ చేసిన కాజల్

తన కేరీర్ లో హెచ్చుతగ్గులను ఓర్చుకుంటూ ముందుకుసాగిన కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal) ఎప్పటికప్పుడు మంచి ఫామ్ ను మెయింటేన్ చేసిoది. కెరీర్ లో ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింద కాజల్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.  
 

26

హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా.. విమెన్ సెంట్రిక్ మూవీస్ తో తన స్టార్ డమ్ ను కాపాడుకుంటూ వస్తోన్న కాజల్ (Kajal).. మెగాస్టార్  ఆచార్య సినిమాలో నటించింది. ఆ తర్వాత గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాజల్ ..పెళ్లి తరువాత కూడా సినిమాలు చేసుకుంటుంది.  
 

36

అయితే, కాబోయే తల్లి కాజల్ అగర్వాల్ తాజాగా తనకు ఇష్టమైన డెజర్ట్‌లతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను తన  ఇన్‌స్టాగ్రామ్ అఫిషియల్ ఖాతాలో పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ తో పంచుకుంది. తన గర్భధారణ కోరికలను తెలియజేస్తూ ఫొటోలను షేర్ చేసింది.

46

కాజల్  పసుపు రంగు టాప్ మరియు లేత గోధుమరంగు ప్యాంటుతో, ఇండో-వెస్ట్రన్ చెవిపోగులు ధరించి కనిపించింది. నోరూరించే డెజర్ట్‌ల ఫొటోలను షేర్ చేసింది. "బ్యాక్‌లావా, బుట్టకేక్‌లు, క్రోక్‌బౌచే’ వంటి ఆహార పదార్థాలు తీసుకుంటోంది. పైగా ‘మీరేం తీసుకుంటారో చెప్పండి’ అంటూ అభిమానులను ప్రశ్నించింది.  

56

దీంతో అభిమానులు కాజల్ పోస్ట్ కు హృదయపూర్వక కామెంట్లను తెలియజేశారు. హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్నారు. ఇటీవల తన హెల్త్ పట్ల సమంత (Samantha) కూడా స్పందించింది.

66

గతవారం ఆమె బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పలువురు ఆకతాయిలు బాడీ షేమింగ్ కామెంట్లతో కాజల్ మనస్సు నొప్పించారు. ఇందుుకు స్పందించిన కాజల్ ఇన్  స్టాలో సుదీర్ఘమైన నోట్ రాస్తూ గట్టిగానే బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories