అఫీషియల్ న్యూస్.. సినిమాలకు సమంత బ్రేక్.. ఎప్పటి వరకు? ఎందుకు?

First Published | Jul 5, 2023, 10:05 AM IST

స్టార్ సమంత వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గోంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన విడుదలైంది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  రెండేళ్లుగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. నాగచైతన్యతో డివోర్స్ తర్వాత కెరీర్ పైనే దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆ మధ్య కొంచెం గ్యాప్ తీసుకొని కంబ్యాక్ ఇచ్చారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించారు.
 

‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో రీఎంట్రీ ఇచ్చి  సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళంలో విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలోని ఓ చిత్రంలో నటించింది. ఆ వెంటనే సై-ఫై మూవీ ‘యశోద’తో మంచి హిట్ అందుకుంది. 
 


ఇక ఈ ఏడాది ఫాంటసీ ఫిల్మ్ ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’, బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తోకలిసి  క్రేజీ సిరీస్ ‘సిటాడెల్’లో నటిస్తోంది.  మరోవైపు తమిళంలో ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. 
 

రెండేళ్లుగా సమంత వరుస షూటింగ్స్ తో బిజీగా గడిపించింది. ‘యశోద’ చిత్రం రిలీజ్ సమయంలో మయోసిటీస్ బారిన పడింది. అప్పటి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయిన తను సైన్ చేసిన చిత్రాలను పూర్తి చేయడంలో పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే సమంత తన ఆరోగ్యం పట్ల కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. 

ఏడాది పాటు సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు పీఆర్ టీమ్ తెలిపింది. మరో మూడు రోజుల్లో ‘ఖుషీ’ షూటింగ్ కూడా పూర్తి కానుంది. అలాగే ‘సిటాడెల్’ షూట్ కూడా ఆల్మోస్ట్ సామ్ పార్ట్ ను కంప్లీట్ చేశారంట. ఈ రెండు చిత్రాల తర్వాత ఆమె కమిట్ మెంట్ల నుంచి ఫ్రీ కాబోతున్నారు. 
 

మరోవైపు కొన్ని ప్రాజెక్ట్స్ కు సంబంధించి గతంలో ప్రొడ్యూసర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి చెల్లించినట్టు తెలిపారు. అందుకే తెలుగులో, హిందీలో ఎలాంటి సినిమాకు సైన్ కూడా చేయలేదని పేర్కొన్నారు. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నారని, పూర్తిగా తన ఆరోగ్యంగా మారేలా, ఇతర ట్రీట్స్ మెంట్స్ కు ఈ సమయాన్ని కేటాయించేలా ప్లాన్ చేసినట్టు తెలిపారు. 
 

Latest Videos

click me!