చైతన్యతో డైవర్స్.. ఆ విషయంలో సమంతకి ప్లస్ అయ్యిందా? తెరపైకి కొత్త కోణం

Published : Dec 08, 2021, 05:53 PM ISTUpdated : Dec 09, 2021, 07:06 AM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. ఇప్పుడు సౌత్‌లో వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్‌. నాగచైతన్యతో విడాకుల ప్రకటనే ఆమె చర్చనీయాంశంగా మారింది. అయితే చైతూతో విడిపోయే విషయంలో సమంత ఎంతో మానసిక సంఘర్షణ ఎదుర్కొంది. 

PREV
110
చైతన్యతో డైవర్స్.. ఆ విషయంలో సమంతకి ప్లస్ అయ్యిందా? తెరపైకి కొత్త కోణం

సమంత(Samantha), నాగచైతన్య(NagaChaitanya) నాలుగేండ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. అక్టోబర్‌ 2న వీరిద్దరు సంయుక్త ప్రకటన చేశారు. ఇకపై తాము కలిసి ఉండలేకపోతున్నామని, విడిపోతున్నట్టు చెప్పారు. దూరమైన తమ మధ్య స్నేహం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టాలీవుడ్‌తోపాటు సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కి గురయ్యింది. ఇక ఇద్దరి అభిమానుల గుండె ఆగినంత పనైంది. ఈ వార్త ఇప్పటికే వైరల్‌ అవుతుంది. నిత్యం చర్చనీయాంశంగా మారింది. 
 

210

అయితే విడాకులు అనేది ఎవరి లైఫ్‌లో అయినా పెద్ద విషాదకర వార్తగా చెప్పొచ్చు. ఇంకా మహిళల విషయంలో అది మరింత బాధగా ఉంటుంది. ఆ మానసిన సంఘర్షణని తట్టుకోవడం కష్టమే. ఈ విషయంలోSamantha కూడా ఎంతో బాధకి గురైనట్టు తెలిపింది. చనిపోతానేమో అనే భావన కూడా కలిగిందని తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వేదనని ఎదురించి నిలబడగలనా, అసలు తన ప్రాణం నిలుస్తుందా? అనే అనుమానం కలిగిందట. ఈ విషయాన్ని వెల్లడించి మరింత షాక్‌కి గురిచేసింది. సంచలనానికి తెరలేపింది. 

310

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో విషయం చర్చనీయాంశం అవుతుంది. చైతన్యతో విడాకులు ఆమె వ్యక్తిగత జీవితానికి పూడ్చలేని నష్టమైనా, కెరీర్‌ పరంగా హెల్ప్ అయ్యిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇటీవల సమంత వరుసగా భారీ సినిమాలను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకటి, తమిళంలో ఓ సినిమా చేసింది. అవి రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. వీటితోపాటు దసరా కానుకగా మరో మల్టీలింగ్వల్‌ సినిమాలను ప్రకటించింది.

410

వీటిలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై పాన్‌ ఇండియా సినిమా చేస్తుంది. దీనికి `యశోద` అనే టైటిల్‌ని ప్రకటించారు. హరి, హరీష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. వీటితోపాటు ఓ ఇంటర్నేషనల్‌ మూవీ కూడా చేస్తుంది సమంత. ఇటీవలే ఆ విషయాన్ని ప్రకటించింది. మరోవైపు `ది ఫ్యామిలీ మ్యాన్‌` తరహాలో ఓ భారీ వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తుందని, దీనికిగానూ సమంతకి భారీ పారితోషికం ఇస్తున్నట్టు టాక్‌. 
 

510

ఇదంతా ఓ ఎత్తైతే తాజాగా మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. సమంత.. చైతూతో డైవర్స్ కి ముందు కంటే ఇప్పుడే ఎక్కువ ఫాలోయింగ్‌ వచ్చిందనే టాక్‌ మొదలైంది. డైవర్స్ మ్యాటర్‌ విషయంలో పాజిటివ్‌గా, నెగటివ్‌గా ఎలాగైనా అత్యధికంగా మీడియా అటెన్షన్‌ మాత్రం సమంత మీదే ఉంది. నాగచైతన్యకి అక్కినేని వంటి బ్రాండ్‌ లాంటి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది. కానీ మీడియా ఫోకస్‌ మొత్తం సమంత చుట్టూనే సాగడం విశేషం. 

610

ఆమెకి సంబంధించిన విశేషాలే ప్రధానంగా ఫోకస్‌ అయ్యాయి. అయితే నెగటివ్‌ విషయంలో సమంత ఘాటుగానే స్పందించింది. అలాంటివి ప్రసారం చేయోద్దని, తన మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని చెప్పింది. ఈ కోణం పక్కన పెడితే, మరో కోణంలో మాత్రం ఈ డైవర్స్ మ్యాటర్‌ సమంతకే ప్లస్‌ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. ఆమెకి ఊహించిన విధంగా ఫాలోయింగ్‌ పెరిగిందని, నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీని సొంతం చేసుకుందనే టాక్‌ కూడా వస్తుంది. 
 

710

`ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`తో సమంతకి నార్త్ లోనూ గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే ఈ డైవర్స్ వార్త మరింతగా వెళ్లిపోయింది. చాలా వరకు సమంతపై సానుభూతి చూపించడం ప్రారంభమైంది. ఆమె ఎప్పుడు ఎలా స్పందిస్తుందనే విషయంపై నెటిజన్లు కూడా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దీనికితోడు సమంత పరోక్షంగా తన లైఫ్‌కి సంబంధించిన పోస్ట్ లు పెట్టగా అవి నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ కావడం సమంత పాపులారిటీని తెలియజేస్తున్నాయి.

810

ఓ రకంగా పాన్‌ ఇండియా ఇమేజ్‌ సమంత సొంతమైందంటున్నారు క్రిటిక్స్. ఇప్పుడు సమంతకి సినిమాలకు అతీతంగా గుర్తింపు వచ్చిందని, ఆమె మార్కెట్‌ పెరిగిందని, క్రేజ్‌ పెరిగిందని అంటున్నారు. అందుకు ఆమెకి వస్తోన్న అవకాశాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటున్నారు. చైతూతోనే ఉంటే, ఇప్పటి సమంత లోకల్‌ సినిమాలే చేసుకునేదని, టాలీవుడ్‌, కోలీవుడ్‌కే పరిమితమయ్యేదని అంటున్నారు.
 

910

అదే సమయంలో సమంత కూడా హద్దులు చెరిపేసి గ్లామర్‌ షో చేయడం కూడా తన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ పెరగడానికి కారణమైందని అంటున్నారు. మొత్తంగా సమంత తన జీవితంలో ఒకటి కోల్పోయి, మరికొకటి పొందిందని చెప్పొచ్చు. సమంత కూడా తన అసలు గేమ్‌ ప్రారంభం కాబోతుందని పరోక్షంగా చెబుతూనే ఉండటం విశేషం. 

also read: Samantha:చైతన్యతో విడాకులు, ప్రాణం పోతుందని భయపడ్డ సమంత... మొదటిసారి షాకింగ్ విషయాలు చెప్పిన స్టార్ లేడీ
 

1010

సమంతతో పోల్చితే.. నాగచైతన్యకి ఆ స్థాయి పాపులారిటీ రాలేదు. ఆయన గురించి అటెన్షన్‌ చాలా తక్కువ. పైగా ఆయన స్పందించింది కూడా లేదు. అప్పటి నుంచి చైతూ సైలెంట్‌ అయ్యారు. కేవలం `లవ్‌స్టోరీ` సినిమా టైమ్‌లోనే సందడి చేశారు. ఆ తర్వాత ఎక్కడా ఆయనకు సంబంధించిన చర్చ లేకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories