Samantha: విడాకుల ప్రకటన వంటి హార్ట్ బ్రేక్‌ ఘటన నుంచి బయటపడేందుకు సమంత ఏం చేస్తుందో తెలుసా ?.. 7 దారులు

Published : Nov 09, 2021, 05:40 PM IST

సమంత జీవితంలో ఒక అతిపెద్ద గుండెపగిలే ఘటన చోటు చేసుకుంది. నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్‌ ఇచ్చింది. అయితే హార్ట్ బ్రేక్‌ లాంటి ఘటన నుంచి భయటపడేందుకు ఇప్పుడు చాలా స్ట్రగుల్‌ అవుతుంది సమంత. ఆ మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు ప్రధానంగా కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతుంది. ఏడు దారులు వెతుక్కుంది. 

PREV
18
Samantha: విడాకుల ప్రకటన వంటి హార్ట్ బ్రేక్‌ ఘటన నుంచి బయటపడేందుకు సమంత ఏం చేస్తుందో తెలుసా ?.. 7 దారులు

అక్టోబర్‌ 2న సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) తమ అభిమానులకు గుండె పగిలే వార్తని తెలిపారు. తామిద్దరం ఇక కలిసి ఉండలేమని, స్నేహితులుగా విడిపోతున్నట్టు(Chay Sam Divorce) ప్రకటించారు. అంతకు ముందు గత కొన్ని రోజులుగా వీరిద్దరి విడిపోతున్నట్టు వచ్చిన వార్తలను నిజం చేస్తూ ఫ్యాన్స్ కే కాదు యావత్‌ సినీ లోకానికి పెద్ద షాకిచ్చారు. అయితే అప్పటి వరకు ఎంతో ఆదర్శ జంటగా, ఎంతో అన్యోన్యమైన జంటగా ఉన్న వీరిద్దరు విడిపోవడం అంటే వారికి ఎంతటి నరకమో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్‌కి అదో పెద్ద విషాదం లాంటి ఘటన. సమంత జీవితంలో ఆ ఘటన చోటు చేసుకుంది. దాన్నుంచి బయటపడేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. అందుకు ప్రధానంగా ఆమె ఏడు మార్గాలను ఎంచుకుందని చెప్పొచ్చు. 
 

28

1.వెకేషన్‌ః  సమంత విడాకుల ప్రకటనకు ముందు నుంచే వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అప్పుడే చైతన్య, Samantha విడిపోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే విషయం తెలిసే దాన్నుంచి బయటపడేందుకు సమంత ఇలా వెకేషన్‌ వెళ్తుందనే టాక్‌ వినిపించింది. ఆ తర్వాత కూడా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి రిషికేష్‌కి వెళ్లింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్‌, బద్రీనాథ్‌లతో కూడిన చార్‌ ధామ్‌ యాత్రని పూర్తి చేసుకుంది సమంత. 
 

38

2.హ్యాబీలుః సమంత చైతూతో డైవర్స్ ప్రకటన నుంచి తనకి నచ్చిన హ్యాబీలపై ఫోకస్‌ పెట్టింది. గతంలో చేయలేని వాటిని ఇప్పుడు చేస్తుంది. అందులో భాగంగా పెయింటింగ్‌ వేస్తూ కనిపించింది సమంత. మరోవైపు స్నేహితులతో కలిసి సైక్లింగ్‌ చేసింది. శిల్పారెడ్డితో కలిసి బోటింగ్‌ చేసింది. మరోవైపు దుబాయ్‌కి చెక్కేసి అక్కడ షాపింగ్‌ చేసింది. అంతేకాదు అక్కడ టేస్టీ ఫుడ్‌ని టేస్ట్ చేసింది సమంత. 

48

3.గదిని శుభ్రం చేసుకోవడంః సమంత కొత్త ఇంట్లోకి మారింది. అక్కడ రూమ్‌ క్లీనింగ్‌. తాను ఇటీవల కొనుగోలు చేసిన డ్రెసెస్‌లను, ఖరీదైన బ్యాగులు, షూస్‌ ఇలా అన్నింటికి క్లీన్‌ చేస్తూ కనిపించింది. నిత్యం ఏదో ఒక పనితో బిజీగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంది సమంత. తన ఆలోచనలు విషాద ఘటన వైపు మరలకుండా జాగ్రత్త పడింది. 
 

58


4.అక్కినేనిని తొలగింపుః సమంత జులైలోనే తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వీరిద్దరు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చైతూతో ఉన్న ఫోటోలను తొలగించింది. దాదాపు ఎనబైకి పైగా ఫోటోలను సమంత డిలీట్‌ చేయడం విశేషం. అక్కినేని ఫ్యామిలీ జ్ఞాపకాలను తన నుంచి పూర్తిగా తొలగించుకుంది. 

68

5.కొత్త డాగ్‌ః సమంతకి పెట్ డాగ్స్ అంటే ఇష్టం. ఇప్పటికే హాష్‌ అనే ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్‌ని పెంచుకుంటుంది సమంత. దీనికి తోడు మరో కొత్త డాగ్‌ని పొందింది. దానికి సాషా అనే పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు సమంతకి ఇంట్లో మంచి ఫ్రెండ్స్ గా ఉండటం విశేషం. వాటితో ఆడుకుంటూ రిలీఫ్‌ అవుతుంది. వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది సామ్‌.

78

6. వర్క్ మోడ్‌ః సమంత కెరీర్‌ పరంగా బిజీ అయ్యేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది. ఇప్పటికే `శాకుంతలం` అనే తెలుగు సినిమాని పూర్తి చేసుకుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` అనే సినిమాని కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల రెండు తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రాలకు సైన్‌ చేసింది. ఇదే కాకుండా బాలీవుడ్‌పైన ఫోకస్‌ పెట్టింది. తాను నటించిన `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` అనే వెబ్‌ సిరీస్‌  సమంతకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్‌ ఆఫర్స్ వస్తున్నాయట. అందులో భాగంగా షారూఖ్‌తో ఓ సినిమా చేయబోతుందనే వార్త వినిపిస్తుంది. అంతేకాదు తాప్సీ సొంత ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయనుందని టాక్‌. మరోవైపు తాజాగా ఆమె గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌(ఇఫీ)లో స్పీకర్‌గా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంది. 

88

7.ఫ్రెండ్స్ తో టైమ్‌ స్పెండింగ్‌ః కొన్ని రోజులుగా సమంత తన ఫ్రెండ్స్ తోనూ ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. సాధ్యమైనంత వరకు ఆమె ఫ్రెండ్స్ తో గడిపేందుకు ప్రయారిటీ ఇస్తుంది. తన జీవితంలో ముఖ్యమైన స్నేహితులతో కలిసి బర్త్ డేలు, పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంది. పూర్తి స్వేచ్ఛగా, సంతోషంగా తన టైమ్‌ స్పెండ్‌ చేస్తుంది. ఇటీవల దీపావళి సందర్భంగా కూడా ఫ్రెండ్స్ తోనే ఉండటం విశేషం. వారిలో శిల్పారెడ్డి ప్రముఖంగా ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories