అభిమానం తలకెక్కి ఏది పడితే అది చేస్తున్నారు ఈమధ్య జనాలు. పాపులర్ అవ్వాలని చేస్తున్నారా? లేక నిజంగానే అభిమానం పొంగి పొర్లుతుందా తెలియదు కాని.. స్టార్ హీరోలు, హీరోయిన్లను దేవుళ్లను చేసి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. మరి వారు అంతలా ఏం చేశారో తెలియదు కాని.. చాలామందికి ఇప్పటిక గుళ్లు కట్టి పూజలు కూడా చేస్తుండగా.. తాజాగా ఆ లిస్ట్ లోకి సమంత కూడా వచ్చి చేరింది. ఇంతకీ సమంతకు ఎక్కుడ గుడి కట్టారు? ఎవరు కట్టారు?
Also Read: వెంకటేష్ - ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా ? బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
హీరోలకు, హీరోయిన్లకు గుడి కట్టి పూజలు చేసే అలవాటు ఎక్కువగా తమిళనాడులో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఆంధ్రప్రదేశ్ కి కూడా పాకింది. తమిళనాడులో ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతి, కుష్బు, హన్సిక, నమిత, ఇలా చాలామంది స్టార్స్ కు గుడికట్టిన వారు ఉన్నారు. ఇటు తెలుగులో కూడా సోనూసూద్ కు గుడి కట్టారు కొందరు అభిమానులు. అయితే తాజాగా సమంతకు కూడా ఆంధ్రాలో గుడి వెలిసింది
Also Read: సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?
తెనాలి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు, సమంత ని ఆరాధించాడు, హీరోయిన్ గా కంటే ఒక మనసున్న మంచి వ్యక్తిగా ఆమెపై అభిమానం పెంచుకున్నాడు. ఇక సమంతపై తన అభిమానాన్ని ఎలా చూపించాలో తెలియక.. సమంత విగ్రహాన్ని తయారు చేయించి.. గుడి కట్టి అందులో ఆమె విగ్రహం పెట్టి ఆరాధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోను ఇక్కడ క్లిక్ చేసి చూడండి
Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?
ఇక ఈ విషయం సమంత వరకు వెళ్ళిందో లేదో తెలియదు కాని.. ఈ విసయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంత మంది పాజిటీవ్ గా స్పందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం నెగెటీవ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంత అభిమానామా.. ఏందీ పైత్యం అన్నట్టుగా జనాలు గుసగుసలాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఎవరి ఇష్టం వారిది అని వదిలేస్తున్నారు.
Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?
ఇక సమంత సినిమాల గురించి చూస్తే.. చాలా కాలం గ్యాప్ ఇచ్చిన సమంత, మళ్ళీ ఇప్పుడిప్పుడే సినిమాల్లో యాక్టీవ్ అవుతోంది. ఆమె నిర్మాతగా మారి ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి, సినిమాలను నిర్మిస్తోంది. అందులో భాగంగా కొత్తవాళ్లతో ఆమె చేసిన ‘శుభం'(Subham Movie) షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక ఆమె నటిస్తు..నిర్మిస్తున్న సినిమా మా ఇంటి బంగారం’ . ఇక దీనితో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తుంది.