చాలా కాలం తర్వాత ఆలీతో సరదాగా టాక్ షోతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ షోకి అతిథిగా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దివంగత శ్రీదేవి తనకు అక్క అవుతుందని అందరూ భావిస్తారు.. నిజానికి ఆమె నాకు చిన్నమ్మ అవుతారు. నేను మాత్రం అక్కా అని పిలిచేదాన్ని. పప్ప, అక్క అని పిలవడం అలవాటైపోయింది. ఆమె ఇంకా అబ్రాడ్ లో షూటింగో, ఈవెంటో చేస్తున్నారన్న ఫీలింగ్ ఉంది. ఆవిడ లేరంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు, అన్నారు.
2018లో శ్రీదేవి దుబాయ్ లోకి ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు మరణించారు. మహేశ్వరి ఇంకా మాట్లాడుతూ.. ఇక సెట్స్ లో నేను చాలా కామ్. ఎవరితో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దీంతో శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా పొగరు ఈమెకు అనుకునేవారు. నిజానికి నా తత్వమే అంత అనేది ఎవరికీ తెలియదు.