తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

Published : Oct 05, 2021, 10:32 AM IST

సమంత(Samantha), నాగ చైతన్యల(Naga chaitanya) వివాహ బంధం విడాకులతో ముగిసింది. పరస్పర అవగాహనతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నెల రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇద్దరూ తెరదించారు.   

PREV
15
తీవ్ర ఆవేదనలో సమంత తండ్రి జోసెఫ్... సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్

సమంత, చైతు విడాకులకు కారణం ఏమిటనేది, వారికి మాత్రమే తెలిసిన విషయం. సమంత తో చైతన్య విడిపోవడానికి కారణం ఇదేనంటూ, కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ వార్తలలో నిజం ఎంత, అనేది కొంత కాలం తరువాత తెలుస్తుంది. 
 

25

అదే సమయంలో జరుగుతున్న ప్రచారానికి పరోక్షంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సమంత. ఆమె నిగూఢంగా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. నాగ చైతన్య మాత్రం ప్రకటన తరువాత ఎటువంటి సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు. ఆయన సాయి ధరమ్ హెల్త్ గురించి మాత్రం ఓ కామెంట్ చేశారు. 


 

35

ఇక సమంత, చైతు కుటుంబ సభ్యులను ఈ సంఘటన వేదనకు గురిచేసినట్లు తెలుస్తుంది. సమంత, చైతు విడాకులు తీసుకోవడం దురదృష్టకరం అని నాగార్జున తెలిపారు. అలాగే సమంత, చైతూ ఇద్దరూ తనకు చాలా ఇష్టమని, వాళ్ళతో తియ్యని అనుభవాలు ఉన్నాయన్నారు. 
 

45


కాగా సమంత తండ్రి మొదటిసారి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన తెలియజేశారు. జోసెఫ్ ప్రస్తుతం నా మెదడు శూన్యంతో నిండి పోయింది, అంటూ ఆయన కామెంట్ చేశారు. దీనితో సమంత విడాకులు విషయం ఆయనను అత్యంత వేదనకు గురి చేసినట్లు అర్థం అవుతుంది. 
 

55
naga chaitanya samantha

ఇక సమంత నటించిన శాకుంతలం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ విజయంపై సమంత విడాకుల ప్రభావం ఉండవచ్చని, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయం ఎంతోకొంత మేర సమంత ఇమేజ్ డామేజ్ చేసింది, అనడంలో సందేశం లేదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories