షణ్ముఖ్‌ కన్నింగ్‌ గేమ్‌.. వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. బిగ్‌బాస్‌5లో గ్రూపు రాజకీయాలు షురూ

Published : Oct 04, 2021, 11:50 PM IST

బిగ్‌బాస్‌ 5లో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న షణ్ముఖ్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఎనిమిది మంది ఆయన్ని నామినేట్‌ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వరస్ట్ పర్‌ఫెర్మెర్‌ అంటూ ఓ రేంజ్‌లో ఏసుకుంటున్నారు.   

PREV
18
షణ్ముఖ్‌ కన్నింగ్‌ గేమ్‌.. వరస్ట్ పర్‌ఫెర్మర్‌ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. బిగ్‌బాస్‌5లో గ్రూపు రాజకీయాలు షురూ

బిగ్‌బాస్‌ 5 ఐదో వారం మరింత హీటుగా స్టార్ట్ అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ కూల్‌గానే సాగినా, ఆ తర్వాత కిచెన్‌లో నెలకొన్న వివాదం గ్రూపు రాజకీయాలను తలపిస్తుంది. షణ్ముఖ్‌, సిరి, జెస్సీలు ఓ గ్రూపుగా,  మిగిలిన వాళ్లు ఓ రకంగా మరో గ్రూపుగా ఉంటున్నారని సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో స్పష్టమైంది. 

28

అదే సమయంలో ఈ వారం తొమ్మిది మంది నామినేట్‌ అయ్యారు. వారిలో ఎనిమిది ఓట్లతో షణ్ముఖ్‌ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, జెస్సీ నాలుగు ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. వీరితోపాటు లోబో, యాంకర్‌ రవి, సిరి, మానస్‌, సన్నీ, ప్రియా, విశ్వ, హమీదలు ఐదో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు. 

38

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో షణ్ముఖ్‌ ఇప్పుడు దారుణంగా ట్రోల్‌ అవుతున్నారు. షణ్ముఖ్‌ ఆట తీరు, ప్రవర్తన పట్ల దుమ్మెత్తి పోస్తున్నారు. మరో నటరాజ్‌ మాస్టర్‌లా మారిపోయాడని, ఓవరాక్షన్‌ చేస్తున్నాడని అంటున్నారు. 

48

ఇప్పటి వరకు ఆయనదే వరస్ట్ పర్‌ఫెర్మెన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు అమ్మాయిల మాదిరిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడని, ఇప్పుడు నామినేషన్‌లోకి వచ్చాడు. మరి ఏం చూపిస్తాడో చూడాలంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 

58

అంతేకాదు షణ్ముఖ్‌ది కన్నింగ్‌ మైండ్‌ అని, గ్రూపు రాజకీయాలు క్రియేట్‌ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఏ విషయాన్ని బయటకు చెప్పలేదని, బిగ్‌బాస్‌ కెమెరాలకు కూడా వినిపించకుండా గుసగుసలాడుతుంటాడని, ఇదంతా కన్నింగ్‌ ఆట తీరని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. 
 

68

సోమవారం కిచెన్‌లో శ్రీరామ్‌, అనీ మాస్టర్లతో జెస్సీకి జరిగిన వివాదంలో అసలేం జరిగిందో తెలుసుకోకుండా మధ్యలో వచ్చిన ఏం తెలియకుండా వాగుతున్నారని అంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తనఫ్రెండ్‌ కోసం మాట్లాడుతున్నానని చెప్పడంలో అర్థం లేదని అంటున్నారు నెటిజన్లు. షణ్ముఖ్‌ది యాటిట్యూడ్‌ని తప్పు పడుతున్నారు. 
 

78

ఇదిలా ఉంటే స్వేత వర్మ, మానస్‌ల మధ్య వివాదం రాజుకుంది. కిచెన్‌లో వీరిద్దరి మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. అదే సమయంలో బిగ్‌బాస్‌5 హౌజ్‌లో ఎవరి స్ట్రాటజీ వాళ్లకుందని, ఏంటన్ని అడిగినా ఇది నా స్ట్రాటజీ అంటున్నారని కామెంట్‌ చేసింది ప్రియాంక. 
 

88

అదే సమయంలో కిచెన్‌లో జరిగిన వివాదంలో జెస్సీ, షణ్ముఖ్‌, సిరిలపై ఫైర్‌ అయ్యాడు కెప్టెన్‌ శ్రీరామ్‌. వంటల పనులు చేయకపోతే ఫుడ్‌ పెట్టమని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేసుకోవాలన్నారు. అందుకు విభేదించిన జెస్సీ తాను ఫుడ్‌ తీసుకోనని తెలిపారు. షణ్ముఖ్‌తో కలిసి కూర్చున్నప్పుడు శ్రీరామ్‌ ఫుడ్‌ తీసుకొచ్చి తినిపించడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories