Samantha: భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని, స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా?

Published : May 27, 2026, 12:17 PM IST

భర్త రాజ్ నిడిమోరు ముందే సమంతకు ఓ అభిమాని ప్రపోజ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ టైమ్ లో స్టార్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా? సమంత చేసిన పనికి అక్కడున్నవారు షాక్ అయ్యారు.

PREV
15
ఏజ్ పెరుగుతున్న తగ్గేది లేదంటున్న సమంత..

40 ఏళ్లకు అడుగు దూరంలో ఉంది సమంత. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో.. ఫిట్ నెస్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నాగచైతన్యతో విడాకులు తరువాత.. చాలా కాలానికి డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడిన సామ్.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీ గా లీడ్ చేస్తోంది. ఇద్దరు కలిసి సినిమాలు, వ్యాపారాలను చూసుకుంటూ.. హాయిగా కాలం గడిపేస్తున్నారు. ఈక్రమంలో సమంతకు మరో వ్యక్తి వచ్చి ప్రపోజ్ చేయడం అందరిని షాక్ కు గురిచేసింది.

25
మా ఇంటి బంగారం సినిమాతో బిజీగా..

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ రోల్ చేసిన సినిమా మా ఇంటి బంగారం. వచ్చే నెల రిలీజ్ కాబోతున్న ఈసినిమాపై ఇప్పటికే మంచి బజ్ నడుస్తోంది. దాన్ని మరింతగా పెంచేందుకు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు టీమ్. సమంతతో పాటు,ఆమె భర్త రాజ్ నిడిమోరు కూడా ఈవెంట్స్ లో పాల్గొంటూ.. ప్రమోషన్లు జోరు పెంచారు. అందులో భాగంగా మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈవెంట్ లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

35
భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని..

మా ఇంటి బంగారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో.. రాజ్ మాట్లాడుతుండగా.. ఓ అభిమాని హఠాత్తుగా స్టేజ్ పైకి వచ్చి.. సమంతకు ప్రపోజ్ చేశాడు. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మూవీ టీమ్ అంతా హాజరయ్యారు. కార్యక్రమంలో సమంతతో పాటు ఆమె భర్త, దర్శకుడు రాజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  స్టేజ్ పై రాజ్ నిడిమోరు మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా కి దూసుకొచ్చాడు.నేరుగా సమంత దగ్గరకు వెళ్లి.. మోకాళ్లపై కూర్చొని, చేతిలో తీసుకువచ్చిన పువ్వులతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న యాంకర్ శ్రీముఖి , డైరెక్టర్ నందినీ రెడ్డి.. షాక్ అయ్యి..అలానే చూస్తూ ఉండిపోయారు.

45
చిరునవ్వుతో స్పందించిన సామ్.

.అభిమాని అకస్మాత్తుగా స్టేజ్ పైకి రావడంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ అభిమాని సమంతతో ఒక్క సెల్ఫీ కావాలని కోరాడు. ఈ సమయంలో సమంత ఎంతో ఓపికగా స్పందించారు. అభిమానిని నిరాశపరచకుండా చిరునవ్వుతో అతడితో కలిసి సెల్ఫీకి ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

55
సమంతపై నెటిజన్ల కామెంట్స్..

తన అభిమాని పట్ల ప్రవర్తించిన తీరుతో సమంత ప్రస్తుతం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అభిమానిని ప్రశాంతంగా హ్యాండిల్ చేయడంతో పాటు, ఎలాంటి అసహనం చూపకుండా స్పందించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తుండగా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories