Mahesh Babu First Movie: మహేష్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ రాజకుమారుడు కాదు.. ఆదిలోనే ఆగిపోయిన సినిమా ఏంటంటే?

Published : May 27, 2026, 11:09 AM IST

మహేష్‌ బాబు `రాజకుమారుడు` చిత్రంతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. కానీ ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన మూవీ ఇది కాదు. సూపర్‌ స్టార్‌ కృష్ణ స్వయంగా వెల్లడించారు. 

PREV
15
వారణాసితో బిజీగా ఉన్న మహేష్‌ బాబు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ఇంటర్నేషనల్‌ స్టార్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్‌ అయితే మహేష్‌ బాబు లెక్క మొత్తం మారిపోతుంది. హీరోగా పరిచయమైన 27ఏళ్ల తర్వాత మహేష్‌ బాబు కెరీర్‌లో పెద్ద టర్న్ చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు.

25
రాజకుమారుడుతో హీరోగా పరిచయం అయిన మహేష్‌ బాబు

ఇదిలా ఉంటే మహేష్‌ బాబు బాలనటుడిగా సినిమాల్లోకి వచ్చాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి బాలనటుడిగానే మెప్పించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత `రాజకుమారుడు` చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. కాకపోతే సూపర్‌ స్టార్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను అందుకోవడంలో వెనకబడింది. ఈ చిత్రానికి అశ్వినీదత్‌ నిర్మించారు.

35
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా

ఇదిలా ఉంటే మహేష్‌ బాబు హీరోగా పరిచయం కావాల్సిన మూవీ ఇది కాదు. సూపర్‌ స్టార్‌ కృష్ణ వేరే ప్లాన్‌ చేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించాల్సింది. సూర్య ఆడియో క్యాసెట్ల కంపెనీ అధినేత అన్నే శేఖర్‌ ఈ మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 1993 విజయదశమి రోజున పాటల రికార్డింగ్‌ ప్రారంభిస్తామని మీడియాకి అధికారికంగా వెల్లడించారు. హీరోయిన్‌ కోసం అన్వేషణ జరుగుతుందని, మంచి టీనేజ్‌ అమ్మాయి కోసం చూస్తున్నామని మీడియాకి కృష్ణ వెల్లడించారు.

45
మహేష్‌ హీరోగా సినిమా ప్రకటించిన కృష్ణ

ఆ సమయంలో మహేష్‌ బాబుని మీడియాకి చూపించాలని విలేకరులు కోరగా, అందుకు కృష్ణ నిరాకరించారు. సినిమా ప్రారంభం రోజునే చూపిస్తామని వెల్లడించారు. ఈ మూవీని మంచి యాక్షన్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కించాలని భావించారు. కథని కూడా సిద్ధం చేవారు. అప్పటికే దర్శకుడిగా పీక్‌లో ఉన్న ఈవీవీ సత్యనారాయణ ఈ మూవీ కోసం స్పెషల్‌గా కేర్‌ తీసుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆదిలోనే ఆగిపోయింది. 1993 మే 14న దీనికి సంబంధించిన వార్త శివరంజని వీక్లీలో ప్రచురితమైంది.

55
ఆగిపోయిన మహేష్‌ మొదటి సినిమా

మరి అది ఓకే అయితే మహేష్‌ బాబు 1993లోనే హీరోగా వెండితెరకు పరిచయం అయ్యేవాడు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఆరేళ్ల తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో `రాజకుమారుడు`తో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. మహేష్‌ బాబు `యువరాజు`, `వంశీ` చిత్రాల్లో నటించినా సక్సెస్‌ రాలేదు. `మురారి`తో తొలి బ్రేక్ దక్కింది. `ఒక్కడు`తో స్టార్‌ అయిపోయాడు మహేష్‌ బాబు. `పోకిరి`తో తిరుగులేని సూపర్‌ స్టార్‌గా ఎదిగారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories