ప్రతి వ్యక్తిపై ఓపెన్ కామెంట్ చేయడానికైనా సోషల్ మీడియా వెసులుబాటు కలిగించింది. ఈ క్రమంలో సెలెబ్రిటీలు చాలా మందికి టార్గెట్ గా మారుతున్నారు. ఆకతాయిలు, నెగిటివ్ మైండ్ కలిగిన వ్యక్తులు హీరో, హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ సమంతను (Samantha) ఉద్దేశిస్తూ దారుణమైన కామెంట్ చేశారు.