ఈ సందర్భంగా జెనీలియా చెబుతూ, జీవితాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సరిగ్గా కరణ్ జోహార్ యాభైవ పుట్టిన రోజున అదే జరిగింది. నీ లైఫ్ సెలబ్రేషన్‌లో మమ్మల్ని భాగం చేసిన కరణ్‌కి ధన్యవాదాలు. నేను ఇంత డాన్సు ఎప్పుడు చేశానో గుర్తే లేదు. అంతగా డాన్స్ చేశాను` అని పేర్కొంది జెనీలియా. కరణ్ జోహార్ బర్త్ డే బాష్‌లో జెనీలియా రెచ్చిపోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలంతా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలుగుకి చెందిన రకుల్, పూజా హెగ్డే, రష్మిక, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మి పాల్గొన్నారు.