Samantha: సమంత నువ్వు తల్లి అయ్యావా? లేదంటే నేను చేస్తా... సమంత మైండ్ బ్లోయింగ్ రిప్లై

Published : Feb 22, 2022, 04:16 PM IST

ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ని ఎదుర్కోవడం సెలెబ్రిటీలకు పెద్ద తలనొప్పి. కొన్నిసార్లు ఈ కామెంట్స్ హద్దులు దాటి పోతాయి. తాజాగా సమంతను ఓ నెటిజెన్స్ దారుణమైన ప్రశ్న అడుగగా... ఆమె షాకింగ్ రిప్లైతో అతని నోటికి తాళం వేసింది.

PREV
16
Samantha: సమంత నువ్వు తల్లి అయ్యావా? లేదంటే నేను చేస్తా... సమంత మైండ్ బ్లోయింగ్ రిప్లై

విడాకుల గోల నుండి బయటపడ్డ సమంత (Samantha)కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె అనేక కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ లో చక చకా పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేశారు.

26

శాకుంతలం (Shakuntalam) పౌరాణిక జోనర్ లో తెరకెక్కుతుంది. శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. ప్రేక్షకుల నుండి లుక్ పట్ల పాజిటివ్ స్పందన వస్తుంది. ఈ సందర్భంగా సమంత ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత ఫ్యాన్స్, నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈక్రమంలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. 
 

36

కాగా ఓ నెటిజెన్ సమంతను దారుణమైన ప్రశ్న అడిగారు. సమంత మీరు ఇప్పటి వరకు తల్లి అయ్యారా? లేదంటే నేను తల్లిని చేస్తాను.. అంటూ అనుచిత ప్రశ్నలు వేశారు. సదరు ప్రశ్నను వదిలేయకుండా సమంత సమాధానం చెప్పారు. ముందు నువ్వు రీప్రొడ్యూస్ అనే పదాన్ని వాక్యంలో ఎలా ఉపయోగించాలో గూగుల్ లో వెతికి నేర్చుకో... అంటూ కౌంటర్ వేసింది. 
 

46


సమంత సదరు నెటిజెన్ ప్రశ్నకు సమాధానం చెప్పిన తీరు ప్రశంసలు అందుకుంటుంది. ఈ ఇంటరాక్షన్ కార్యక్రమంలో సమంత అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 
 

56

కాగా సమంత హీరోయిన్ గా యశోద (Yashoda) టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా రూ. 3 కోట్లతో ఖరీదైన సెట్స్ నిర్మిస్తున్నారు. యశోద మూవీతో పాటు శాకుంతలం పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.

66

వీటితో పాటు సమంత నటించిన బైలింగ్వల్ మూవీ కణ్మణి రాంబో ఖతీజా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక డిజిటల్ సిరీస్లపై కూడా సమంత ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆమె నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. మొత్తంగా విడాకుల తర్వాత సమంత కెరీర్ మరింత జోరందుకోవడం విశేషం.

 

click me!

Recommended Stories