Rakul Preet Singh Pics : లెహంగా చోలీలో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. అందంతో ఆటాడేస్తోంది..

Published : Feb 22, 2022, 02:56 PM IST

టాలీవుడ్ హీరోయిన్  రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh) ఇటీవల సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటోంది. అటు ప్రియుడితోనూ టూర్లకు వెళ్తూ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది. ఇటు గ్లామర్ ఫొటోషూట్లతోనూ నెటిజన్లకు ఊపిరాడకుండ చేస్తోంది.      

PREV
16
Rakul Preet Singh Pics : లెహంగా చోలీలో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు.. అందంతో  ఆటాడేస్తోంది..

తెలుగు ఇండస్ట్రీని ఊపూపిన  రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాట్ టాపిక్ గా మారుతోంది. తన ప్రియుడితో కలిసి టూర్లకు, వేకేషన్లకు వెళ్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు హాట్ ఫొటో షూట్స్ కూడా చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది రకుల్.. 

26

గతేడాది అక్టోబర్‌ నెలలో తాను బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది రకుల్‌. ఇప్పుడు వీరిద్దరు డేటింగ్‌ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. వెకేషన్లు, పార్టీలకు జంటగా వెళ్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. నిన్న ఈ క్రేజీ లవ్‌ బర్డ్స్  తాజ్‌ మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. 
 

36

అయితే, నిన్నే అటు అలియా భట్ మరియు రణ్ బీర్ కపూర్ కూడా తాజ్ మహాల్ ను జంటగా విసిట్ చేశారు. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ ‘హో మీరు కూడా తాజ్ మహల్ ను సందర్శించారా?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ కు అర్జున్ కపూర్ స్పందిస్తూ ‘అవును.. కానీ రణ్ బీర్ కపూర్ మొదట నాతోనే తాజ్ మహల్ ను  సందర్శించాడు’ అంటూ పేర్కొన్నాడు. 
 

46

ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జానీ భగ్నానీతో కలిసి  చిత్రనిర్మాత లవ్ రంజన్ వివాహానికి హాజరైంది. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు శ్రద్దా కపూర్,  రణ్ బీర్ కపూర్ కూడా హాజరయ్యారు. 
 

56

లవ్ రంజన్ తన చిరకాల స్నేహితురాలు అలీషా వైద్‌తో ఫిబ్రవరి 20న ఆగ్రాలో కుటుంబ సభ్యులు, పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అతని నెక్ట్స్ మూవీలో హీరోహీరోయిన్లుగా రణబీర్ కపూర్ మరియు శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు.  

66

కెరీర్‌ పరంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల తెలుగులో `కొండపొలం` చిత్రంతో అలరించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ప్రస్తుతం రకుల్‌కి తెలుగులో మరే సినిమా లేకపోవడం గమనార్హం. అదే సమయంలో బాలీవుడ్‌ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా  అజయ్ దేవగన్‌తో `రన్‌వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డాక్టర్ G`, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి `అటాక్` అనే సినిమాలు చేస్తోంది . అలాగే `థ్యాంక్‌ గాడ్‌`, `ఛత్రీవాలీ`, `మిషన్‌ సిండ్రెల్లా` సినిమాలకు కూడా అంగీకారం తెలిపింది. 
 

click me!

Recommended Stories