నాగచైతన్య కంటే సమంత సంపాదనే ఎక్కువ? భారీగా పెరిగిన ఆస్తులు ?

First Published | May 6, 2021, 1:11 PM IST

నాగచైతన్య కంటే సమంతనే ఎక్కువగా సంపాదిస్తుందా? ఈ విషయంలో చైతూ కాస్త జలసీగా ఫీలవుతున్నాడా? భారీగా పెరిగిన సమంత ఆస్తుల విలువ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ప్రజెంట్‌ చై-సామ్‌ ఆస్తులెంతో తెలుసా?

సమంత, నాగచైతన్యల సినీ కెరీర్‌ అటు ఇటుగా ఒకే సారి స్టార్ట్ అయ్యింది. అయితే సమంత కంటే ఏడాది ముందే చైతూ `జోష్‌` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్ట్స్ `ఏ మాయ చేసావె` చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. ఇద్దరు సూపర్‌ హిట్స్ అందుకుని ఓవర్‌ నైట్ లో స్టార్స్ అయ్యారు. 2010లో స్టార్ట్ అయిన వీరి జర్నీ పెళ్లి వరకు చేరుకున్న విషయం తెలిసిందే.
అయితే అప్పట్నుంచి ఇప్పటి వరకు సమంత 40 సినిమాల్లో నటించింది. నాగచైతన్య 20 సినిమాలు చేశాడు. నాగచైతన్యతో పోల్చితే, సమంత రెమ్యూనరేషన్‌ తక్కువే. ఎందుకంటే హీరోలకు ఇచ్చినంత పారితోషికం హీరోయిన్లకివ్వరు. ఇటీవల కాస్త పెరిగింది కానీ, అంతకు ముందు కోటీ రూపాయలు ఇస్తే అదే ఎక్కువ. కానీ ఓ మోస్తారు హీరోలకు రెండు కోట్ల వరకు ఇస్తున్నారు.

ప్రస్తుతం సమంత పారితోషికం మూడు కోట్లు. `శాకుంతలం` చిత్రంతో ఆమె రెమ్యూనరేషన్‌ పెంచిందట. ప్రస్తుతం చైతూ పారితోషికం ఐదు కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన చైతూ పారితోషికమే ఎక్కువ. కానీ ఆస్తుల్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది.
ప్రస్తుతం సమంత ఆస్తులు దాదాపు వంద కోట్ల వరకు ఉంటాయని సమాచారం. గతేడాది వరకు ఆమె ఆస్తులు రూ.85కోట్లు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడది వంద కోట్లు దాటిందట. సమంత మొదటి నుంచి మనీ మేనేజ్‌మెంట్‌ చేసుకుంటూ వస్తుందట. హైదరాబాద్‌, వైజాగ్‌, అమరావతి, చెన్నై ప్రాంతాల్లో ల్యాండ్లు కొని పెట్టుకుందట. వాటి విలువ క్రమంగా పెరుగుతూ వచ్చిందని, అది వంద కోట్లకు దాటిందని భోగట్టా.
నాగచైతన్య సుమారు 5కోట్లు పారితోషికం తీసుకుంటున్నా, ఆయన ఆస్తులు మాత్రం 40-50కోట్ల మధ్యలోనే ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది. ఈ లెక్కన చైతూ కంటే సమంత ఆస్తులే ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాగచైతన్యకి నాగార్జున అనే పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. కానీ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని సమంత దాదాపు వంద కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టుకోవడం విశేషంగా చెప్పుకొవచ్చు.
దీంతోపాటు ఆమె ప్రత్యుష అనే ఓ ఫౌండేషన్‌ని నిర్వహిస్తుంది. అలాగే ఏకం పేరుతో ఫ్రీ చైల్డ్ ఎడ్యూకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ని నిర్వహిస్తుంది. దీనికితోడు `సాకి` పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ని కూడా నిర్వహిస్తుంది. వీటిలో భాగంగానే సమంతకి బీఎండబ్ల్యూ కారు ఉంది. మరోవైపు వరుసగా సినిమాలతోపాటు కమర్షియల్‌ యాడ్స్ లోనూ మెరుస్తుంది సమంత.
ఇక చైతూకి సొంతంగా బంగ్లాలు, ఖరీదైన కార్లు, ఒకటి రెండు చోట్ల ల్యాండ్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. అయితే చైతూ సంసాదన తొలి నాళ్లలో నాగార్జున అకౌంట్లకే వెళ్లేది. ఇప్పుడిప్పుడే ఆయన సొంతంగా కూడబెట్టుకుంటున్నారు. దీంతో ఆయన ఆస్తులు తక్కువే అంటున్నాయి. అయితే తండ్రి నుంచి ఆయనకు వందల కోట్ల ఆస్తులు వారసత్వంగా వస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
మొత్తంగా సమంత, నాగచైతన్య ఆస్తులు ప్రస్తుతం రూ. 150కోట్లకుపైనే అనే టాక్‌ నడుస్తుంది. వీరిద్దరు కలిసి కమర్షియల్‌ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇకపై వీరిద్దరు కలిసి కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. మనీ మెనేజ్‌మెంట్‌ చేసుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నారట. ఈ విషయంలో సమంతనే లీడ్‌ చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇది సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తల ఆధారంగా తీసుకున్నదే. నిజం ఏంటనేది తెలియాలి.
ప్రస్తుతం సమంత `శాకుంతలం` చిత్రంలో, అలాగే తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. నాగచైతన్య ప్రస్తుతం `లవ్‌స్టోరి`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `లాల్‌ సింగ్‌ చద్దా`లో గెస్ట్ గా మెరవబోతున్నాడని టాక్‌. ఇదిలా ఉంటే చైతూ, సమంత ప్రేమించుకుని 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Latest Videos

click me!