సెలైన్‌ పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పిన సమంత.. `యశోద` కోసం స్టార్‌ హీరోయిన్‌ డెడికేషన్‌కి ఫిదా

First Published Nov 6, 2022, 5:53 PM IST

సమంత నటించిన మొదటి పాన్‌ ఇండియా చిత్రం `యశోద` త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఆమెకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ `యశోద`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా తెరకెక్కింది. హరి-హరీష్‌ దర్శక ద్వయం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల(నవంబర్‌) 11న ఈ చిత్రం విడుదల కానుంది. సినిమాని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో సినిమాకి సంబంధించి, సమంతకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. 

సమంత వర్క్ డెడికేషన్‌ గురించి నిర్మాత కృష్ణ ప్రసాద్‌ వెల్లడించారు. ఆమెకి ఆరోగ్యం బాగా లేదనే విషయం డబ్బింగ్‌ సమయంలో తెలిసిందని, అప్పటి వరకు తమకు చెప్పలేదన్నారు నిర్మాత. డబ్బింగ్‌ ప్రారంభానికి రెండు మూడు రోజుల ముందు ఆమె ఈ విషయాన్ని చెప్పారని, తనపై అనేక రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో తన ఆరోగ్య స్థితి గురించి అందరికి తెలియాలని ఆమె అధికారికంగా ప్రకటించారని తెలిపారు. 
 

అయితే డబ్బింగ్‌ విషయంలో మాత్రం తను ఎంతో డెడికేషన్‌తో ఉన్నారన్నారు. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత డబ్బింగ్ చెప్పించాలనుకున్నామని, కానీ రిలీజ్‌ డేట్‌ అనుకున్న నేపథ్యంలో ఆమె పట్టుబట్టి డబ్బింగ్‌ చేయించిందని పేర్కొన్నారు. తన గొంతు సహకరించికపోయినా కష్టపడి చేసిందని, డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆమె డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిందని చెప్పారు నిర్మాత. అయితే తమిళ డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఆమె బాగా నీరసించిపోయిందని, ఆ సమయంలో రోజూ సెలైన్‌ పెట్టుకుని మరీ సొంతంగా డబ్బింగ్‌ చెప్పిందన్నారు. తాము ఇతరులతో చెప్పించాలని భావించిన వద్దు వద్దు తనకు కమాండ్‌ ఉన్న భాషని తానే చెబితే బాగుంటుందని చెప్పి సమంత డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిందన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. 
 

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమని, సమంతపై అంత బడ్జెట్‌ పెట్టడం, పాన్‌ ఇండియా రేంజ్‌లో చేయడం రిస్క్ అనిపించలేదా అన్న ప్రశ్నకి నిర్మాత స్పందిస్తూ, తాను కంటెంట్‌ కి ఎగ్జైట్‌ అయి ఇంతటి బడ్జెట్‌ పెట్టానని, మొదట దర్శకులు మూడు నాలుగు కోట్లే అనుకున్నారని, కానీ ఇది గ్లోబల్‌ వైడ్‌గా స్పాన్‌ ఉన్న కథ అని, బడ్జెట్‌ పెడితే దీని రేంజ్‌ మారుతుందని, బడ్జెట్‌ పెట్టామన్నారు. అయితే ప్రస్తుతం ప్రొడక్ట్ విషయంలో, బిజినెస్‌ విషయంలో తాము హ్యాపీగా ఉన్నామని, ఎలాంటి టెన్షన్‌ లేదన్నారు. 
 

తాను `ఆదిత్య 369` సినిమా చేసే టైమ్‌లో టైమ్‌ ట్రావెల్ కథ ఆడియెన్స్ కి రీచ్ అవుతుందా? వాళ్లకి అర్థమవుతుందా? రిస్క్ అవుతుందా? అనే టెన్షన్‌ పడ్డానని, రిలీజ్‌ కి ముందు కూడా ఎంతో ఆందోళనకి గురయ్యానని, బాలు, దర్శకుడు, రైటర్స్ ఇచ్చిన ధైర్యంతో ముందుకెళ్లాలనని, అది సంచలన విజయం సాధించడంతోపాటు తనకు పేరుని తెచ్చిందని, నిర్మాతగా నిలబెట్టిందన్నారు. మళ్లీ ఇన్నాళ్లకి అంతటి ఎగ్జైట్‌మెంట్‌ `యశోద` ఇచ్చిందని అందుకే బడ్జెట్‌ పెంచి నిర్మించామన్నారు. 
 

ప్రస్తుతం సమాజంలో సరోగసి అంశం బాగా వినిపిస్తుందని, నయనతార పిల్లలకు సంబంధించిన సరోగసి అంశం చర్చనీయాంశం అయ్యింది, ఇప్పుడిది హాట్‌ టాపిక్‌గా మారుతుందని, అదే సమయంలో సరోగసి నేపథ్యంలో రూపొందిన `యశోద`రిలీజ్‌ కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మరోవైపు ఉన్నిముకుందన్‌ పాత్రని తెలుగులో ఏ నటుడు చేయడానికి ముందుకు రాలేదని, దీంతో మలయాళ నటుడిని తీసుకోవాల్సి వచ్చిందన్నారు నిర్మాత. 
 

click me!