సమంత అరుదైన రికార్డ్.. పవన్‌, మహేష్‌లకు షాక్‌..

First Published | Aug 24, 2020, 2:20 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత ట్విట్టర్‌లో అరుదైన రికార్డ్ సాధించింది. ట్విట్టర్‌లో `లేడీ ఐకాన్‌ సమంత` పేరుతో క్రియేట్‌ చేసిన ఒక యాష్‌ ట్యాగ్‌ లక్షల్లో రీట్వీట్లు పొందింది. ట్రెండ్స్ సమంత పేరుతో ఈ ట్వీట్ల వర్షం కురిపించారు. దీన్ని రెండు 57వేల ఎనిమిది వందల మంది ట్వీట్‌ చేశారు. 
 

దీంతో ఎలాంటి బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లకు కాకుండా సాధారణంగా, అకేషన్‌ లేకుండా ట్వీట్స్ చేయడం, ఇంతటి భారీ స్థాయిలో ట్వీట్లు చేయడం రికార్డ్ సృష్టించింది.
మొత్తంగా ఆదివారం సమంత ట్విట్టర్‌ని ఓ ఊపు ఊపేశారని చెప్పొచ్చు. ఈ సందర్భంగా `లేడీ ఐకాన్‌ సమంత` యాష్‌ట్యాగ్‌తో కూడిన సమంత పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

తనని ఇంతగా అభిమానిస్తున్నందుకు సమంత నెటిజన్లకి, అభిమానులకి ధన్యవాదాలు తెలిపింది. వారికి ప్రేమకి కృతజ్ఞతాభావంతో ఉంటానని తెలిపింది.
అయితే ఇటీవల బర్త్ డే సీడీపీలతో మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌ లకు చెందిన హ్యాపీబర్త్ డే ట్వీట్లు 65మిలియన్ల వరకు చేసి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. కానీ సమంత ఎలాంటి అకేషన్‌ లేకుండా ఇంతగా హల్‌చల్‌ చేయడం విశేషం.
ఇదిలా ఉంటే సమంత బిజినెస్‌లోకి అడుగుపెడుతుంది. ఎడ్యూకేషన్‌ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఆదివారం వెల్లడించింది.
తన స్నేహితురాల్లు ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి, ఎడ్యకేషనిస్ట్ ముక్తా ఖురానాతో కలిసి ఏకం పేరుతో ప్రీ స్కూల్స్ లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లో దీన్ని ప్రారంభించారు. ఓ డిఫరెంట్‌ మెథడ్‌లో ఈ ప్రీ స్కూల్స్ ని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నట్టు సమంత తెలిపింది.
ఈ ఏడాది ప్రారంభంలో `జాను` సినిమాలో మెరిసిన అక్కినేని కోడలు..ఆ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత అధికారికంగా ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు. తమిళంలో ఓ సినిమా, తెలుగులో నందినిరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Latest Videos

click me!