Samantha Confirms Pregnancy: సమంత తాను గర్భవతిని అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సినిమాల నుంచి మరో విరామం తీసుకుంటున్నాను అని అన్నారు. కాకపోతే ఈ సారి చాలా సంతోషంగా బ్రేక్ తీసుకుంటున్నా అని అన్నారు.
సమంత నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం చిత్రం థియేటర్స్ లో దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. సమంతకి అద్భుతమైన కంబ్యాక్ లభించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఇప్పుడు అభిమానుల సంతోషం రెట్టింపు అయ్యే గుడ్ న్యూస్ ని సమంత ప్రకటించింది. మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ లో సమంత తాను గర్భవతిని అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చాలా అందంగా ఈ విషయాన్ని సమంత అభిమానులకు తెలిపింది.
25
సారీ, మరో చిన్న బ్రేక్
మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో సమంత మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తున్న సమయంలో తన ప్రెగ్నన్సీ గురించి ప్రస్తావించారు. మా ఇంటి బంగారం సక్సెస్ తర్వాత ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలి అని మీడియా ప్రతినిధి అన్నారు. దీనికి స్పందించిన సమంత చిరునవ్వుతో మాట్లాడుతూ, “సారీ గైస్, ఇంకో చిన్న గ్యాప్ తీసుకుని తిరిగి వస్తాను. ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి. ఈ గ్యాప్ తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను” అని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే అందరి దృష్టిని ఆకర్షించాయి.
35
సమంతకి అభిమానుల శుభాకాంక్షలు
సమంత ఎంతో సహజంగా, ఎలాంటి ప్రత్యేక ప్రకటనలు లేకుండా తన గర్భధారణ విషయాన్ని వెల్లడించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు కూడా తెరపడింది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్న సమంత ప్రయాణాన్ని దగ్గరగా గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సమంత ఇటీవల మా ఇంటి బంగారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే ఆమె అభిమానులకు ప్రత్యేక చిత్రంగా మారింది. సినిమాకు లభిస్తున్న స్పందనతో పాటు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ సంతోషకరమైన వార్త కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు కారణాలతో సమంత వార్తల్లో నిలిచారు.
55
తల్లిగా సమంత కొత్త జర్నీ
ఇప్పుడు సమంత ప్రసూతి సెలవులు తీసుకోనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒకవైపు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుండగా, మరోవైపు ఆమె తిరిగి వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారో అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తల్లితనం కోసం చిన్న విరామం తీసుకుంటానని, ఆ తర్వాత తిరిగి వస్తానని సమంత స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఆమె జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుండగా, ఆమె కమ్‌బ్యాక్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.