మెగాస్టార్‌ స్టార్‌తో సమంత.. ఏకంగా షూటింగ్‌ కూడా పూర్తి.. క్రేజీ డిటెయిల్స్..

Published : Mar 24, 2024, 10:42 AM IST

సమంత ఏడాది క్రితం సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. ఇప్పుడు ఆమె మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. అయితే ఏకంగా మెగాస్టార్‌తో కలిసి ఆమె యాక్ట్ చేసిందట.   

PREV
16
మెగాస్టార్‌ స్టార్‌తో సమంత.. ఏకంగా షూటింగ్‌ కూడా పూర్తి.. క్రేజీ డిటెయిల్స్..

సమంత గతేడాది సినిమాలకు బ్రేక్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాది పాటు తాను సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు వెల్లడించింది. అయితే ఇటీవల తాను రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారడం, పలు ప్రైవేట్‌ ఈవెంట్లలో సందడి చేయడం చూస్తుంటూ కమ్‌ బ్యాక్‌కి రెడీ అనే సాంకేతాలను పంపిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఇటీవల ముంబయిలో జరిగిన అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌లోనూ సమంత సందడి చేసింది. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

26

ఇదిలా ఉంటే సమంత.. ఏకంగా మెగాస్టార్‌తో జోడీ కడుతుందట. అంతేకాదు ఏకంగా షూటింగ్‌ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఫోటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. మరి సమంత మెగాస్టార్‌తో జత కట్టడమేంటి, షూటింగ్‌ అయిపోవడమేంటి అనేది చూస్తే.. 
 

36

సమంత.. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టితో ఆమె జోడీ కట్టింది. అయితే అది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్‌ కోసం. ఈ ఇద్దరు కలిసి `ఐసీఎల్‌ ఫిన్‌ కార్పో` అనే ఫైనాన్స్ సంస్థ కమర్షియల్‌ కోసం కలిసి నటించారు. ఈ ఫైనాన్స్ కంపెనీ ప్రమోట్‌ చేస్తూ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ మేరకు ఈ ఇద్దరిపై యాడ్‌ని షూట్‌ చేశారు. ఇందులో మమ్ముట్టితో కలిసి సామ్‌ రెట్టింపు ఎనర్జీతో పాల్గొనడం విశేషం. 
 

46

ప్రస్తుతం ఈ యాడ్‌కి సంబంధించిన షూటింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిర్వహకులు వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేసుకున్నారు. ఇందులో సమంత బౌన్స్ బ్యాక్‌ అనేలా కనిపిస్తుంది. ఆమె లుక్స్ ఆకట్టుకుంటుంది. పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సమంత బ్యాక్‌ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

56

సమంత ఇటీవల సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ మంటలు పుట్టిస్తుంది. తాను సిద్ధమే అనే హింట్‌ మేకర్స్ కి ఇస్తూ వచ్చింది. ఇప్పుడు యాడ్‌తో తన రీఎంట్రీని స్టార్ట్ చేసింది. 

66

సమంతతో మేకర్స్ సినిమాలకు కూడా చర్చలు జరుపుతున్నారట. ఓ బాలీవుడ్‌ మూవీకి డిస్కషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి మాత్రం సమంత తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు, లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories