మెగాస్టార్‌ ఇంటికే అందరు వస్తారు.. కానీ చిరంజీవినే ఆయన ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశాడు.. ఆయన ఎవరో తెలుసా?

First Published Mar 24, 2024, 10:07 AM IST

మెగాస్టార్‌ చిరంజీవితో అవసరం ఉంటే ఎంత వారైనా ఆయన వద్దకు వెళ్లాల్సిందే. ఆయన విషెస్‌ తీసుకుంటారు. కానీ ఏకంగా చిరంజీవినే ఆయన ఇంటికెళ్లడం ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 

చిరంజీవి, శ్రీకాంత్‌ మధ్య మంచి బాండింగ్‌ ఉంది. ఇద్దరు కలిసి రెండు సినిమాలు చేశారు. చిరంజీవి అంటే తన సొంత అన్నలాగే భావిస్తాడు శ్రీకాంత్‌. అన్నయ్య అంటూ పలకరిస్తాడు. అయితే శ్రీకాంత్‌పై చిరంజీవి తన ప్రేమని చూపించిన సందర్భాలు ఇటీవల కాలంలో చాలా అరుదు. మీడియా ముఖ్యంగా ఎప్పుడూ జరగలేదు. దీంతో ఆ కోణం బయటకు రాలేదు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

కానీ ఇప్పుడు చిరంజీవి చేసిన పని అటు శ్రీకాంత్ ని మాత్రమే కాదు, ఇటు అభిమానులను, ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఇదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. శనివారం హీరో శ్రీకాంత్‌ పుట్టిన రోజు. అయితే ఈ ఫ్యామిలీ స్టార్‌ ఇలాంటి బహిరంగ సెలబ్రేషన్లు, హడావుడి చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. పూర్తిగా ఫ్యామిలీతోనే ప్రైవేట్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. 

చిరంజీవి మాత్రం శ్రీకాంత్‌కి బిగ్‌ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఏకంగా ఆయన ఇంటికే వెళ్లి బర్త్ డే సెలబ్రేట్‌ చేయడం విశేషం. శ్రీకాంత్‌ బర్త్ డే అని తెలిసిన చిరంజీవిలో ఆయనపై ప్రేమ తనని కుదురుగా ఉండనివ్వలేదు. ఏదో చేయాలనిపించింది. దీంతో కేక్‌ ఆర్డర్‌ చేయించుకుని శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లాడు. తన కొడుకు రోషన్‌, ఫ్యామిలీ సమక్షంలో కేక్‌ కట్‌ చేయించి శ్రీకాంత్‌కి తినిపించారు. 
 

ఈ సందర్భంగా చిరంజీవి.. శ్రీకాంత్‌పై ప్రేమని చాటుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మెగాస్టార్‌ తన ఇంటికి రావడంతో శ్రీకాంత్‌ ఆనందానికి అవుదుల్లేవు. వీరిద్దరు ఆనందానికి ఈ ఫోటోలే నిదర్శనంగా నిలిచాయి. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడు బహిరంగంగా శ్రీకాంత్‌పై ప్రేమని వ్యక్తం చేసే సందర్భం రాకపోయినా, చిరు ఇప్పుడు చేసిన పని మాత్రం అభిమానులను, ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. 
 

ఇక చిరంజీవి, శ్రీకాంత్‌ కలిసి `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌`, `శంకర్‌దాదా జిందాబాద్‌` అనే చిత్రాల్లో నటించారు. ఈ రెండూ మంచి విజయాలు సాధించాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య బాండింగ్‌ మరింత పెరిగింది. అది స్నేహం కావచ్చు, సోదర భావం కావచ్చు. ఇప్పుడు చూపించే సమయం వచ్చింది. 
 

ప్రస్తుతం శ్రీకాంత్‌.. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌`లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర`లోనూ ఆయనకు ముఖ్య పాత్ర. ఇటీవల `స్కంద`, `హంట్‌` మూవీస్‌తో వచ్చాడు. అలాగే `కోటబొమ్మాళి`లో ఆయనే మెయిన్‌ లీడ్‌. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అవకాశం వస్తే, సోలో హీరో, అదే సమయంలో ఇతర హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రల్లో మెరుస్తూ రాణిస్తున్నారు శ్రీకాంత్‌. చిరంజీవి `విశ్వంభర`లో బిజీగా ఉన్నారు.  
 

click me!