ఆమెతో మహేష్ బాబు రహస్య ప్రేమాయణం... పెళ్ళికి కారణం ఎవరో తెలుసా?

First Published | Aug 7, 2024, 9:51 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల వివాహం అప్పట్లో ఓ సెన్సేషన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ లవ్లీ కపుల్ ప్రేమ కథలో చాలా మలుపులు ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..

కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు. ఆయన స్టైల్, హ్యాండ్ సమ్ నెస్, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. ఇక సామాజిక సేవతో రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు. 


వీటన్నింటికీ మించి మహేష్ ఓ మంచి హస్బెండ్, ఫాదర్. సూపర్ స్టార్ గా క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన బిజీ షెడ్యూల్స్ లో కుటుంబానికి సమయం కేటాయిస్తారు. విరామం దొరికితే భార్యాపిల్లలతో విహారాలకు వెళ్లడం మహేష్ కి చాలా ఇష్టం. అలాగే ఇంట్లో సితార, గౌతమ్ తో సరదా ఆదుకోవడం మహేష్ కి ఇష్టమైన వ్యాపకం. 


కాగా మహేష్ ప్రేమ వివాహం అప్పట్లో ఓ సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడైన మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరని? పెద్ద చర్చ నడిసింది. ఇక మహేష్ ప్రేమ కథలో సినిమాకు మించిన డ్రామా, ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. చాలా రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం. 

పలు సందర్భాల్లో మహేష్, నమ్రత తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. ఆనాడు జరిగిన ఆసక్తికర సంఘటనలు వివరించారు. హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. 

వంశీ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25 రోజులు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నమ్రత, మహేష్ ప్రేమలో పడ్డారు. సినిమాకు అదే చివరి షెడ్యూల్ కాగా... షూటింగ్ పూరైతే ఇకపై కలుస్తామా లేదా? అనే వేదన ఇద్దరిలో ఉంది. ఆలస్యం చేయడం మంచిది కాదని గ్రహించిన నమ్రత ముందుగా మహేష్ తో తన ప్రేమ వ్యక్తీకరించారట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం పెంచుకున్న మహేష్ వెంటనే ఓకే చెప్పారట. 

వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. మహేష్ రహస్యంగా నమ్రతను వివాహం చేసుకున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. 

ఇక ఈ వివాహం వెనుక మహేష్ సిస్టర్ మంజుల కృషి ఎంతగానో ఉందట. నమ్రతతో వివాహానికి కృష్ణగారు ఒప్పుకోలేదట. ఆయనను ఒప్పించే బాధ్యత తీసుకున్న మంజుల ఆ పని విజయవంతంగా నిర్వహించి కీలక పాత్ర వహించారు. మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం. మహేష్-నమ్రతలకు ఇద్దరు సంతానం. అబ్బాయి గౌతమ్ టీనేజ్ లో ఉన్నాడు. ఇక అమ్మాయి సితార 11 ఏళ్ల పాప, సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. అప్పుడే సెలెబ్రిటీ హోదా అనుభవిస్తుంది. టాలీవుడ్ లవ్లీ ఫ్యామిలీ గా మహేష్ కుటుంబాన్ని చెప్పుకుంటారు. 
 

Latest Videos

click me!