రూట్‌ మార్చిన సమంత.. ఆ రూమర్లకి చెక్‌ పెడుతూ క్రేజీ ప్రాజెక్ట్ ? ఈ సారి నెక్ట్స్ లెవల్ షో?

Published : Jul 27, 2024, 06:42 PM ISTUpdated : Jul 27, 2024, 07:03 PM IST

సమంత కమ్‌ బ్యాక్‌ చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటుంది. అదిరిపోయే సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. లేటెస్ట్ వార్త ఇప్పుడు షాకిస్తుంది.   

PREV
16
రూట్‌ మార్చిన సమంత.. ఆ రూమర్లకి చెక్‌ పెడుతూ క్రేజీ ప్రాజెక్ట్ ? ఈ సారి నెక్ట్స్ లెవల్ షో?

సమంత లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి దగ్గరలో ఉంది. ఆమె చివరగా చేసిన సినిమాల సమయంలో ఈ ట్యాగ్‌ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్‌ నిజం కాబోతుందనే సాంకేతాలనిస్తుంది సామ్‌. ఆమె కమ్‌ బ్యాక్‌ విషయంలో చాలా సెలక్టీవ్‌గా ఉంటున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు, యాక్షన్‌ థ్రిల్లర్స్ కి ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

26

సమంత.. గతేడాది సినిమాలకు బ్రేక్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆమె సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్టు తెలిపింది. మయోసైటిస్ తో బాధపడుతుంది సమంత. దాన్నుంచి పూర్తిగా కోలుకుని, సినిమాలు చేయాలని భావించింది. అందుకే ఆమె ఏడాది కాలంగా దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కమ్‌ బ్యాక్‌కి సంబంధించిన ప్లాన్స్ చేస్తుంది. రీఎంట్రీ అదిరిపోయేలా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటుందట. అయితే సమంతకి ఆఫర్లు లేవు, అందుకే కనిపించడం లేదనే ప్రచారం జరిగింది. కానీ వాటిని మౌనంగానే తీసుకున్న సామ్‌.. తన ప్రాజెక్ట్ లతోనే సమాధానం చెప్పాలని భావించిందట. అందులో భాగంగానే సైలెంట్ గా సినిమాలు చేస్తుందని సమాచారం. 
 

36
Samantha

ఇప్పటికే ఆమె `మా ఇంటి బంగారం` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీని ప్రకటించింది సమంత. దీనికి సంబంధించిన లుక్‌ కూడా బయటకు వచ్చింది. ఇందులో ఓ వైపు కిచెన్‌, వంట సమాను కనిపిస్తుంది. మరోవైపు సమంత చేతిలో గన్‌, రక్తం మరకలు కనిపిస్తున్నాయి. దీంతో ఇది యాక్షన్‌ మూవీ అని అర్థమవుతుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌ ఇంకా స్టార్ట్ కాలేదని తెలుస్తుంది. అప్పటికే సమంత హిందీలో `సిటాడెల్` అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. ఇది రిలీజ్‌ కావాల్సి ఉంది. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో ఇది రాబోతుందని తెలుస్తుంది. 
 

46

ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రాజెక్ట్ కి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. తాజాగా ఆ వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. `రక్త్ బ్రహ్మాండ్‌` పేరుతో వెబ్‌ సిరీస్‌ చేస్తుందని తెలుస్తుంది. నెట్‌ ఫ్లిక్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించింది. అయితే దీన్ని దర్శకద్వయం రాజ్‌ డీకేలు రూపొందిస్తుండటం విశేషం. పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుందట. హర్రర్‌ ఎలిమెంట్లు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ మేరకు విడుదలచేసిన క్రౌన్‌ పోస్టర్‌ ఆద్యంతం ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. కాస్టింగ్‌ డిటెయిల్స్ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఇందులో మెయిన్‌ లీడ్‌ సమంతనే అనే ప్రచారం బాగా సాగుతుంది. 
 

56

ఇదిలా ఉంటే చూడబోతుంటే సమంత రూట్‌ మార్చినట్టు అనిపిస్తుంది. ఆమె అంతకు ముందు అన్ని కమర్షియల్‌ మూవీస్ చేసింది. అడపాదడపా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి మెప్పించింది. కానీ ఇప్పుడు మాత్రం తనే మెయిన్‌ లీడ్ గా ఉండే సినిమాలను ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో ఇందులో ఆమె యాక్షన్‌తో రచ్చ చేయబోతుందని తెలుస్తుంది.

66

ప్రస్తుతం చేస్తున్న `సిటాడెల్`లో యాక్షన్‌ చేసింది సమంత. రాబోతున్న `మా ఇంటి బంగారం`లోనూ ఆమె యాక్షన్‌ చేస్తుందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే `రక్త్ బ్రహ్మాండ్` సైతం అదే కోవలో ఉంటుందట.దీని ప్రకారం సామ్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో ఆడియెన్స్ అలరించడానికి రాబోతుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories